English   

విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయిందా ?

vijay
2019-07-26 07:51:02

కష్ట ఫలమో అదృష్టమో కానీ, ప్రస్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఈరోజు రిలీజ్ కానుంది. దీంతో గత కొద్దిరోజులుగా వేరే ఎటువంటి షూట్స్ కూడా పెట్టుకోకుండా సినిమా ప్రమోషన్ మీదనే కూర్చున్నాడు. ఈ సినిమా విడుదలయ్యాక ఆయన క్రాంతి మాధవ్ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తి చేయనున్నాడు. అయితే ఆయన ”హీరో” అనే సినిమాలో కూడా నటించడానికి ప్లాన్ చేసుకున్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు . బైక్ రేసింగ్ కి సంబందించిన సన్నివేశాలు పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి అవి నిజంగానే రేసింగ్ సీన్స్ లా సహజంగా ఉండాలి కాబట్టి అంతర్జాతీయ బైక్ రేసర్ అయిన రజని కృష్ణన్ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నాడు ఈ హీరో. ఈ మధ్యనే బైక్ రేసింగ్ సీన్స్ కొన్ని షూట్ చేశారట, ఆ సీన్స్ కోసం 2 కోట్లకు పైగా నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు చెబుతున్నారు. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ బైక్ రేసింగ్ సీన్స్ చాలా అద్భుతంగా వస్తాయని నిర్మాతలు భావించారట, కానీ ఆ అవుట్ పుట్ చూశాక వారు డీలా పడిపోయారని అంటున్నారు. ఇలా అయితే అనుకున్న బడ్జెట్ లో సినిమా తీయలేమని భావించి దర్శకుడిని పిలిపించి ఈ సీన్స్ తక్కువ ఉండేలా సినిమా కధలో మార్చు చేయమని కోరారట. స్క్రిప్ట్ మార్చాక  నిర్మాతలకు నచ్చితేనే హీరో సినిమా మళ్ళీ సెట్స్ మీదకెళుతుందని, లేదంటే విజయ్ సహా అందరికీ అడ్వాన్స్ లు వదిలేసుకుని పూర్తిగా ప్యాకప్ చెప్పేస్తారని అంటున్నారు. అయితే ఈ విషయంలో సినిమా యూనిట్ ఎటువంటి అప్‌డేట్ లేదు. చూద్దాం ఏమవుతుందో ?

More Related Stories