English   

కళ్యాణ్ రామ్ చేతికి తారక్ సినిమా ?

kalyanram
2019-07-26 08:29:07

మన తెలుగు సినిమా దశా దిశా బాహుబలి ఎలా మార్చేసిందో ? అలానే కన్నడ సినిమా దశా దిశాను మార్చేసింది కేజీఎఫ్. కన్నడ రాక స్టార్ యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'కేజీఎఫ్' సంచలన విజయాన్ని సాధించింది. ఈ దెబ్బతో కన్నడ సినిమా తెలుగు, మళయాళ, తమిళ, హిందీ బాషలలోకి కూడా అనువాదం అయ్యి కోట్లు కుమ్మరించి పెట్టింది. ఈ సినిమా అంత క్రేజ్ వచ్చిన నాటి నుండి ఈ సినిమా డైరెక్టర్  ప్రభాస్ కి ఒక కధ చెప్పాడు, ప్రభాస్ ఆ సినిమా చేస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. అందుకు వేరే కారణాలు కూడా లేకపోలేదు. కేజీఎఫ్ సినిమాని తెలుగులో రిలీజ్ చేసేప్పుడు ప్రమోషన్స్ పరంగా ప్రభాస్ హెల్ప్ చేశాడు. ఈ కారణంతో వారిద్దరూ సినిమా చేస్తున్నారని ప్రచారం జరిగింది. మరి నిజమో కాదో తెలీదు కానీ ఆ కధ విన్న ప్రభాస్ ఆ కధ తాను చేయడం కంటే తారక్ చేస్తే బాగుంటుందని పంపాడని ఆ కధను తారక్ చేసాడని ప్రచారం జరుగుతోంది. దానికి ఊతం ఇచ్చేలాగా దీనికి మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాతలలో ఒకరయిన నవీన్ యెర్నేని మాట్లాడారు. మేము ప్రశాంత్, తారక్‌తో చర్చలు జరుపుతున్న విషయం నిజమేనని, ప్రశాంత్ వచ్చి ఎన్టీఆర్ కి లైన్ చెప్పి, అది ఆయనకు నచ్చితే ఖచ్చితంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. అంతే కాక అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే 2020 చివర్లో ఈ సినిమా ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు. అప్పటికి ఎన్టీఆర్ 'RRR', ప్రశాంత్ 'కేజీఎఫ్ చాప్టర్ 2' రెండూ పూర్తవుతాయని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే దీంతో ఇప్పుడు మరో వర్షన్ ప్రచారం మొదలయ్యింది. అదేంటంటే హీరో కం నిర్మాతగా డ్యూయల్ రోల్ పోషిస్తున్న తారక్ అన్న క‌ళ్యాణ్ రామ్ ఈ సినిమాను తాను తీసుకుని ఎన్టీఆర్ ఆర్ట్స్ మీద చేస్తానన్న ప్ర‌తిపాద‌న మైత్రీ వాళ్ల‌కు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. మైత్రీ వాళ్లు ఒప్పుకుంటే ఒక్కరే సినిమా చేయాలని లేదంటే ఈ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ – మైత్రీ రెండు బ్యాన‌ర్ల మీద సంయుక్తంగా చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. అయితే ఈ విషయం మీద మరి కొద్ది రోజుల్లో క్లారిటీ వ‌చ్చే ఛాన్స్ ఉంది.  

More Related Stories