చిరంజీవి సినిమా మొదలయ్యేది ఎక్కడ్నుంచో తెలుసా.. ఆ ఊరికి మెగాస్టార్..

ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి జాతకం ఎలా మారుతుందో చెప్పడం కష్టం. అదేదో సినిమాలో ఆహుతి ప్రసాద్ చెప్పినట్లు నిన్న రైట్ అనుకున్నది.. రేపు రాంగ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఆ మధ్య సైరా తర్వాత చిరంజీవి తర్వాతి సినిమా ఏంటి అంటే బోయపాటితోనే కదా అన్నారు. కానీ సీన్ లోకి సడన్ గా కొరటాల శివ వచ్చాడు. ఆర్నెళ్ల ముందే ఈ సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పై వర్క్ చేస్తూనే ఉన్నాడు ఈయన. కొరటాల చేసిన నాలుగు సినిమాలు కూడా బాగానే ఆడాయి. భరత్ అనే నేను కాస్త అటూ ఇటూ అయినా.. కలెక్షన్లు మాత్రం 90 కోట్లకు పైగానే వచ్చాయి. దాంతో ఇది కూడా అబౌ యావరేజ్ కిందే లెక్క. అంటే ఇప్పటి వరకు ఫ్లాప్ లేని ప్రయాణం అన్నమాట. పైగా సందేశాత్మక కథలను బాగా చెప్తాడనే పేరుంది. కమర్షియల్ హంగులు అద్ది.. మెసేజ్ లు ఇవ్వడంలో బాగా ఆరితేరిపోయాడు కొరటాల శివ.
ప్రస్తుతం బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు ఈ దర్శకుడు. ఠాగూర్ తరహాలోనే ఇది కూడా ఉండబోతుందని తెలుస్తుంది. అందులో లంచం గురించి చెబితే ఇందులో నిరుద్యోగం గురించి చెప్పబోతున్నాడు చిరంజీవి. కొరటాల కూడా ఈ కథను పక్కాగా సిద్ధం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ లో ఈ సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడు కొరటాల. ఇక ఈ సినిమా శ్రీకాకుళంలోని పలాస నుంచి మొదలు పెట్టనున్నారు. అక్కడే తొలి షెడ్యూల్ పూర్తి చేయనున్నారు. ప్రజారాజ్యం కోసం అప్పట్లో పలాస వెళ్లిన చిరంజీవి.. ఆ తర్వాత వెళ్లలేదు. ఇప్పుడు మళ్లీ హీరోగానే అక్కడ అడుగు పెట్టనున్నాడు మెగాస్టార్. మరి ఈ కాంబినేషన్ లో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.