పూరీకి కబురు పెట్టిన మెగా స్టార్ !

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టడమే కాక, ఆ తదనంతరం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దాదాపు అందరు హీరోల గురించి మాట్లాడి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయాడు పూరీ జగన్నాధ్. పూరీ రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రచ్చ రేపుతోంది. చాన్నాళ్ళగా పూరీ రామ్ లు హిట్ కోసం ఎంత పరితపిస్తున్నారో అంతకు మించి మాస్ ఆడియెన్స్ ఒక మాస్ సినిమా కోసం ఎదురు చూస్తుండడంతో ఈ సినిమా బంపర్ హిట్ గా నిలిచింది. అయితే హిట్ సినిమాలు ఏవి వచ్చినా ఆ సినిమాలను ప్రోత్సహించడంలో ముందుండే మెగాస్టార్ చిరంజీవి ఇస్మార్ట్ శంకర్ చూస్తానని త్వరలోనే ఒక స్పెషల్ ప్రీమియర్ ఏర్పాటు చేయాలని పూరికి కబురు పెట్టారట. రాజు అడిగితే దెబ్బలకు కొదవా, మెగా స్టార్ అడిగితే కాదంటారా, అందుకే వెంటనే పూరీ అన్ని ఏర్పాట్లు చేయించారట. ప్రస్తుతం సక్సెస్ టూర్ లో ఉన్న పూరీ మెగా పిలుపునందుకుని హుటాహుటిన వెనక్కి వస్తున్నారట. ఈరోజు రేపట్లో చిరు ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ చూసే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి పూరి జగన్నాథ్‌తో ఇంతకు ముందే మెగాస్టార్ రీ ఎంట్రీగా 150 వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ నచ్చలేడనే కారణం వలన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం చేజారింది. దీంతో చిరంజీవికి పూరి జగన్నాథ్‌కు చెడిందనే ప్రచారం సాగింది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమా వీక్షిస్తే ఈ సినిమాకు మరింత ఊపు రావడం, కలెక్షన్స్ పెరగడం జరగచ్చు. ఈ సినిమా చూసిన తరువాత చిరంజీవి తన 153వ సినిమాగా ఆటో జానీ అనే సబ్జెక్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.