మహేష్ నిజంగానే దర్శకులను అలా మోసం చేస్తున్నాడా..?

మహేష్ బాబు కథల కంటే కూడా హిట్స్ ఇచ్చిన దర్శకులకే ఎక్కువ విలువ ఇస్తున్నాడంటూ ఈ మధ్య పూరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదే ఇప్పుడు మహేష్ అభిమానులకు కూడా కోపం తెప్పిస్తున్నాయి. పూరీతో చేసిన రెండు సినిమాలకు ముందు ఆయన ప్లాపుల్లోనే ఉన్న విషయం వాళ్లు గుర్తు చేస్తున్నారు. పోకిరి సినిమాకు ముందు పూరీ జగన్నాథ్ కు వరస ఫ్లాపులున్నాయి. 143తో పాటు సూపర్ సినిమా కూడా ఫ్లాపే. కానీ అలాంటి పరిస్థితుల్లోనూ ఆయన్ని నమ్మి పోకిరి చేసాడు. ఆ తర్వాత బిజినెస్ మేన్ చేసినపుడు కూడా దీనికి ముందు ఆయనకు ఫ్లాపులున్నాయి. గోలీమార్, ఏక్ నిరంజన్ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అలాంటి సమయంలోనూ మరోసారి ఆయనకు ఛాన్స్ ఇచ్చాడు మహేష్. ఈ రెండు సినిమాలు బాగానే ఆడాయి. కానీ ఇప్పుడు జనగణమన సినిమా విషయంలో మాత్రం మహేష్ బాబు ఎందుకో కానీ పూరీకి ఆఫర్ ఇవ్వడం లేదు. దాంతో పూరీ కామెంట్ చేసాడు. కానీ ఈ వ్యాఖ్యలు విని మహేష్ బాబుకు సపోర్ట్ చేస్తున్నారు అభిమానులు. ఈ విషయాన్ని పెద్దది చేయొద్దని పూరీ కోరుకుంటున్నా కూడా సోషల్ మీడియాలో జరగాల్సిన రచ్చ జరిగిపోతుంది. ఇదిలా ఉంటే తనకు హిట్స్ ఇచ్చిన దర్శకులను మహేష్ ఇట్టే నమ్మేస్తుంటాడు. ఆ లెక్కన చూసుకున్నా కూడా పూరీకి ఆఫర్ ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు ఎందుకో మరి ఈ ఇద్దరి మధ్య పొత్తు కుదరడం లేదు. మరి ఈ వార్ ఎక్కడ ఆగుతుందో చూడాలి.