English   

డియర్ కామ్రేడ్ రివ్యూ

Dear Comrade
2019-07-26 13:24:08

విజయ్ దేవరకొండ – రష్మిక మందన జోడిగా రెండో సారి తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో సూపర్ హిట్ సినిమాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ పెళ్లి చూపులు, దొరసాని, లాంటి సినిమాలని కో ప్రొడ్యూస్ చేసిన బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా 4 భాష‌ల్లో విడుద‌లైంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్న నేప‌థ్యంలో ఈ సినిమా అంచ‌నాల‌ను అందుకుందా.. లేదా.. అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

క‌థ‌ :

బాబీ అలియాస్ చైతన్య (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) కాకినాడ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ చదువుతూ ఉంటాడు. తన తాత కామ్రేడ్ కావడంతో ఆయన పోలికలే పుణికి పుచ్చుకుని విప్ల‌వ భావాలతో విద్యార్ధులకి లీడర్ గా స్టూడెంట్ యూనియన్ నడుపుతాడు. అయితే తన పక్కింటికి వచ్చిన చుట్టాలమ్మాయయిన క్రికెట్ ప్లేయ‌ర్ లిల్లీ అలియాస్ అపర్ణా దేవిని(ర‌ష్మిక‌)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతని ప్రేమలో పడుతుంది. అయితే బాబీతో లవ్ లో ఉన్న లల్లీ బాబీకి ఒక గొడవలో దెబ్బలు తగలడంతో, తను కావాలో గొడవలు కావాలో అడుగుతుంది, ఆవేశంలో బాబీ లల్లీని దూరం చేసుకుంటాడు.  ఆ తరువాత లిల్లీ, బాబీ ఇద్దరూ క‌లుస్తారా..? చివ‌ర‌కు ఏమ‌వుతుంది ? అనే విషయాలు బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే కిక్. 

క‌థ‌నం:

కేవలం రెండు షార్ట్ ఫిలిమ్స్ తీసిన దర్శకుడిని నమ్మి టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ డేట్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎంతగానో నమ్మితే తప్ప అది సాధ్యం కాదు, అలాగే తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఫ‌స్టాఫ్ వ‌ర‌కు ఈ పోరాటం స‌రైన దారిలోనే వెళ్లింద‌నిపించింది. కాలేజ్ స్టూడెంట్స్, ఆవేశం, స్ట్రైక్స్, గొడ‌వ‌లు, నమ్మిన దాని కోసం ఎక్కడిదాకా అయినా వెళ్ళే తెగింపు. సగటు పట్టణం కుర్రాళ్ళలో ఉండే తొంద‌ర‌పాటు త‌నం. అన్నీ విజ‌య్ కారెక్ట‌ర్ లో చూపించాడు ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ‌. దానికే ప్రేమ‌ను కూడా మిక్స్ చేసాడు. కానీ సెకండాఫ్ లో మాత్రం ఇవేవీ క‌నిపించ‌లేదు. హీరోలో ఆవేశం త‌గ్గిన‌ట్లే క‌థ‌లో వేగం త‌గ్గిపోయింది. అలా సినిమా స్లో నెరేష‌న్ డియ‌ర్ కామ్రేడ్ సినిమాకు శాపంగా మారింది. ప్రేమ వ‌చ్చేటెప్పుడు హాయిగానే ఉంటుంది.. కానీ వెళ్లేట‌ప్పుడు బాధ‌నిస్తుంద‌నే పాయింట్ ని బాగా చెప్పాడు ద‌ర్శ‌కుడు. హీరో ప్రేమ కూడా దూర‌మైపోయిన త‌ర్వాత ప్రేక్ష‌కుల‌కు కూడా చూడ్డానికి భ‌రించాల్సి వ‌స్తుంది. మ‌రీ విసుగు తెప్పించే సన్నివేశాలు లేక‌పోయినా కూడా ఇలాంటి ట్రావెల్ స్టోరీస్ మ‌న‌కు కాస్త కొత్త‌. ప్రేమ‌లో విఫ‌ల‌మైతే ప్ర‌కృతిని ప్రేమించ‌డం అలా బైక్ ఎక్కేసి వెళ్లే క‌థ‌లు అల‌వాటు కావ‌డానికి టైమ్ ప‌డుతుందేమో..?  విజయ్ గత సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి. కానీ ఇప్పుడు అలా కాదు.. పరిస్థితి వేరు.. విజయ్ దేవరకొండ ఇమేజ్‌కు ఇది పరీక్ష. ఇలాంటి ఎమోషనల్ స్లో స్టోరీని ప్రేక్షకుల్లోకి విజయ్ ఎంతవరకు తీసుకెళ్తాడు అనేది ఆసక్తికరమే. విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రోసారి త‌న న‌ట‌న చూపించాడు.. బాబీ పాత్ర‌కు ప్రాణం పోసాడు. ర‌ష్మిక మంద‌న్న కూడా లిల్లీ పాత్ర‌లో జీవించింది. ఫ్రెండ్స్ గ్యాంగ్ పరిమితుల మేర బాగా నటించారు. ఇక సాంకేతికంగా సినిమా బాగా వచ్చినట్టే. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ అందించిన పాట‌లు, నేపధ్య సంగీతం బాగున్నాయి. ఇక కూడా విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. ఎడిటింగ్ మీద శ్రద్ద పెట్టాల్సింది.  నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. 

ఫైనల్ గా : అయితే ముందు నుండీ సినిమా మీద భారీ  అంచ‌నాలు ఎక్కువ పెట్టేసుకోవ‌డంతో ఈ సినిమా న‌చ్చ‌న‌ట్లు అనిపిస్తుంది కానీ. మొత్తానికి డియ‌ర్ కామ్రేడ్ స్లో నెరేటెడ్ ల‌వ్ స్టోరీ విత్ మసాలా స్టఫ్.

రేటింగ్ : 3 / 5.

More Related Stories