English   

డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్...వారితోనేనా ?

Dear Comrade
2019-07-26 17:34:52

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే ఈ సినిమా చూసిన కరణ్ జోహార్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్లు ప్రకటించారు. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌ మీదనే డియర్ కామ్రేడ్ సినిమా హిందీలో రీమేక్ చేస్తానని కరణ్ ప్రకటించారు. అయితే కరణ్ జోహార్ నిర్మించబోతున్న హిందీ రీమేక్‌ లో కూడా విజయ్ నటిస్తారని వార్తలు వచ్చాయి.  అయితే ఆ విషయంలో నిజం లేదని అంటున్నారు. హిందీలో విజయ్ స్థానంలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్‌, రష్మిక స్థానంలో జాన్వీ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. నిజం ఎంతుందో తెలీదు కానీ బాలీవుడ్ మీడియా వర్గాల్లో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కరణ్ జోహార్ ఈ విషయాన్ని ద్రువీకరించాల్సి ఉన్నది. గతంలో ఇషాన్, జాన్విలు  కలిసి ధఢక్ సినిమా చేశారు.  మరాఠీ మూవీ సైరాట్ హిందీ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. వీరు మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని అంటున్నారు. తెలుగులో ఇజి రష్మికల పెయిర్ లా వీరి పెయిర్ కూడా బాగుంటుందని అంటున్నారు. అయితే ఈ వార్త ఎంత వరకూ నిజం అవుతుందో చూడాలి మరి.

More Related Stories