English   

భారతీయుడి కోసం క్యాస్టింగ్ కాల్

kamal
2019-07-26 19:24:51

దాదాపు పాతికేళ్ళ క్రితం వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో ? శంకర్ కి డైరెక్టర్ గా ఎంత మంచి పెటు తెచ్చిపెట్టిందో మనకి తెలియనిది కాదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేసిన శంకర్ భారతీయుడు-2 టైటిల్ తో సినిమా అనౌన్స్ చేయగా ఆ సినిమా సెట్స్ మీదకి కూడా వెళ్ళింది. హీరోగా కమల్ నే మళ్లీ ఎంచుకున్నా, సినిమా ప్రారంభం అయిందని ఒకసారి అసలు ప్రారంభమే అవలేదని అలా రకరకాల ప్రచారాలతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చారు. బడ్జెట్ విషయంలో లైకా ప్రొడక్షన్స్ కి శంకర్ కు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని ప్రచారం జరిగినా ఇప్పుడు ఈ సినిమా యూనిట్ నుండి ఒక ఆసక్తి కర ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో నటించేందుకు నటీనటులు కావలెను అని ఓ క్యాస్టింగ్ కాల్ విడుదల చేసింది సినిమా యూనిట్. తమ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యులు కావాలని అనుకునేవారు తమ ప్రొఫైల్‌ ను casting.indian2@gmail.com అనే ఈ మెయిల్ కి మెయిల్ చేయాలని ఆ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే కాజల్ ని మెయిన్ హీరోయిన్ గా తీసుకోగా ఇప్పుడు ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్ ఐశ్వర్యా రాజేశ్, ప్రియా భావాని శంకర్ లను కూడా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి తమిళ సంగీత సంచలనం అనిరుధ్ ఈ సంగీతం అందించనున్నారు.

 

More Related Stories