English   

జ్యోతిక జాక్ పాట్ ఫస్ట్ లుక్...చూశారా ?

 jackpot
2019-07-27 09:33:07

తమిళ్ లో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది స్టార్‌ హీరో సూర్య సతీమణి సీనియర్‌ హీరోయిన్‌ జ్యోతిక. ఈమె తమిళ్ ప్రేకకులకే కాక తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమే. తాజాగా ఆమె గులేబకావళి అనే సినిమాతో ఫేమస్ అయిన కళ్యాణ్‌ డైరెక్షన్‌ లో ఓ సినిమా చేస్తోంది. జాక్‌పాట్‌ అనే టైటిల్‌ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. సూర్య సొంత బ్యానర్‌ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి పడి పడి లేచె మనుసు ఫేమ్‌ విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా తనకు అచ్చివచ్చిన పోలీసు అధికారిణి పాత్రలో జ్యోతిక నటిస్తున్నారు. జ్యోతిక, రేవతి ముఖ్యపాత్రల్లో ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌ గా విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో అనువదిస్తున్నారు. ఈ సినిమా ఆడియో, ట్రైలర్ ని నేడు విడుదల చేయనున్నారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఎర్రరంగు టాప్ తో జ్యోతిక జీప్ మీద నుంచున్న లుక్ ఉంది. ఇక జ్యోతిక ప్రస్తుతం దృశ్యం ఫేమ్‌ జీతూ జోసెఫ్‌ తెరకెక్కిస్తున్న చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో కార్తీ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం యొక్క షూటింగ్‌ మొదలైంది. ఇక జాక్ పాట్ సినిమా వచ్చే శుక్రవావరం రిలీజ్ కానుంది.

More Related Stories