మాస్ మహారాజా డిస్కో రాజా నుండి లేటెస్ట్ అప్డేట్

మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో ఎన్ని సినిమాలు చేసినా ఏవీ కలిసి రావడం లేదు. బెంగాల్ టైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని చిత్రాలు వరుసగా చేసినా వాటిలో కేవలం రాజా ది గ్రేట్ సినిమా ఒక్కటే హిట్ గా నిలిచింది. ఆయన ప్రస్తుతం క్షణం ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా అనే చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. రవితేజ గత సినిమా నేల టిక్కెట్ నిర్మించిన రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక తాజాగా పాయల్ రాజ్‌పుత్.. రవితేజతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగష్టు నాల్గో తేదీ నుంచి ఢిల్లీలో ఓ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు, అది పూర్తైన తరువాత స్విట్జర్లాండ్‌లో మరో షెడ్యుల్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ స్విట్జర్లాండ్ షెడ్యూల్ లో పాయల్ మాస్ రాజాతో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో సునీల్, ‘వెన్నెల’ కిశోర్, సత్య, రామ్కీ తదితరులు నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.