English   

డియర్ కామ్రేడ్ బ్యాన్...అక్కడి ప్రేక్షకుల షాక్ !

 dear comrade
2019-07-27 10:21:15

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రెండో సారి నటించిన సినిమా డియర్ కామ్రేడ్, కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న రిలీజ్ కాగా మొదటి ఆట నుండే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. నిజానికి ఈ సినిమా మొదటి నుండి భారీ అంచనాల మీదనే ఉంది. రెండో సారి ఈ జోడీ నటించడం, టీజర్, ట్రైలర్స్ అద్భుతంగా అనిపించడంతో సినిమా మీద ఎనలేని ఆసక్తిని రేపింది. అయితే మొదటి ఆట నుండే ఆ ఆసక్తి తగ్గుతూ వచ్చింది. అయితే ఈ సినిమా నిలిపివేయాలని కన్నడిగులు డిమాండ్ చేయడం కలకలం రేపింది. ఇతర రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ దృష్ట్యా డియర్ కామ్రేడ్ సినిమాని తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేశారు.  అయితే ఈ సినిమా తెలుగు వర్షన్‌ వలన కన్నడ వర్షన్ ని బ్యాన్ చేయాలని కన్నడ సినీ ప్రే,మికులు డిమాండ్ చేస్తున్నారు. అందుకు కారణం తమ బాషకి చెందిన తమ ఆడపడుచుతో ఉన్న లిప్ లాక్స్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వారు అలా డిమాండ్ చేస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎక్కువ థియేటర్లలో కన్నడ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ షోలను రిలీజ్ చేయడమే, తమ రాష్ట్రంలో మాతృభాష కన్నడ వెర్షన్ కంటే ఎక్కువ థియేటర్స్‌లో తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడం అవమానంగా భావిస్తున్నారు అక్కడి సినీ ప్రేమికులు. అలా తమను తమ భాషను అవమానించిన ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. చూడాలి ఈ వ్యవహారం ఎంత దాకా వెళ్తుందో ?

More Related Stories