డియర్ కామ్రేడ్ ఫస్ట్ డే కలెక్షన్స్...దుమ్ము దులిపాడుగా

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం `డియర్ కామ్రేడ్`. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుండే ఈ సినిమాకి మిక్సడ్ టాక్ వచ్చినా తొలి రోజు మాత్రం ఈ సినిమా మంచి వసూళ్లు దక్కించుకుంది. డియర్ కామ్రేడ్ దాదాపు 8 కోట్ల షేర్ ని రాబట్టింది మొదటి రోజున. అయితే ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో భారీ ఓపెనింగ్స్ సాధించింది డియర్ కామ్రేడ్ చిత్రం. దాంతో 7 కోట్ల 49 లక్షల షేర్ తో కామ్రేడ్ మొదటి రోజున రచ్చ చేశాడు. ఇక తమిళ , కన్నడ , మలయాళ భాషలను కలిపితే ఈ మొత్తం మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఓవర్సీస్లో 1.60 కోట్లు సాధించగా, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.02 కోట్లు సాధించింది. ఈజోరు ఇలాగే మరో రెండు రోజులు కొనసాగితే బయ్యర్లు అందరూ లాభాల్లోకి వస్తారు. వీకెండ్ తో పాటు ప్రస్తుతం కొత్త సినిమాల పోటీ వచ్చే వారం వరకూ లేకపోవడంతో కామ్రేడ్ సేఫ్ జోన్ లో ఉన్నటే !
కలెక్షన్స్ చూస్తే (షేర్) :
తెలంగాణ – 3. 02 కోట్లు...4.3 కోట్లు గ్రాస్
సీడెడ్ – 88 లక్షలు...1.2 కోట్లు గ్రాస్
కృష్ణా – 38 లక్షలు
గుంటూరు – 62లక్షల 50 వేలు
నెల్లూరు – 26 లక్షలు
ఈస్ట్ – 90 లక్షలు
వెస్ట్ – 53లక్షల 25 వేలు
ఇతరత్రా – 2. 05
మొత్తం – 7. 49 కోట్లు
ఒవర్సీస్ - 1.60 - 3.2 గ్రాస్
కర్ణాటాక - .72 - 1.3 గ్రాస్
అలా మొత్తంగా వరల్డ్ వైడ్ పదకొండు కోట్ల పది లక్షలు షేర్ సాధించగా, 17.9 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.