English   

డియర్ కామ్రేడ్ పై విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే  ?  

vijay devarakonda
2019-07-27 17:23:14

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుండే మిక్సడ్ టాక్ వచ్చినా తెలుగు రాష్ట్రాలలో అలాగే ఓవర్సీస్ లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. ఈరోజు ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ వేదికపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ  ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ - బాబీ, లిల్లీల జర్నీ అని, ఈ సినిమాతో చాలా ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు చేయాల్సిందంతా ఒక్క ముక్క వదలకుండా చేశానని చెప్పుకొచ్చాడు. అంతే కాకా సినిమా థియేటర్ లో చూస్తున్నప్పుడు ఏడ్చేశానని ఆయన పేర్కొన్నారు. అంతే కాక  సినిమాపై వస్తున్న విమర్శలను పూర్తిగా ఏకీభవిస్తున్నానని ఈ కథను ఇలాగే చెప్పాలనుకున్నామని సినిమా ల్యాగ్ అవుతుందనే విషయం మీద స్పందించాడు. తన కెరియర్లో ఈ సినిమా ఒక్కటే మొదటిసారిగా నాలుగు భాషల్లో విడుదలైందని అంటున్నారు. ఈ సినిమా చేయడం నాకు గర్వంగా ఉందని, ఈ యూనిట్ ను చాలా మిస్సవుతున్నానని చెప్పుకొచ్చింది. అయితే మైత్రీ మూవీస్ మరో సినిమా చేస్తున్నానని విజయ్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా చాలా స్లోగా ఉన్న ఓపికతో చూడండని విజయ్ చెప్పుకొచ్చాడు. 
 

More Related Stories