అభిమానులకి షాక్ ఇచ్చిన మోక్షజ్ఞ !

నందమూరి అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విషయాలు రెండే రెండు. అందులో ఒకటి బాలయ్య ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ కా, మరొకటి బాలయ్య సినీ వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇస్తాడని బాలయ్య లెజెండ్ సినిమా నుంచి ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. మధ్యలో ఒకట్రెండు సార్లు బాలయ్య కూడా మోక్ష కథలు చూస్తున్నామని ఆ కథ సెట్ అయితే వెంటనే సినిమా చేస్తాడని ప్రకటించాడు కూడా. అయితే నేను ప్రకటించి కూడా రెండు మూడేళ్లు కావస్తున్న ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. ఆయన సింగపూర్లో నటనలో శిక్షణ పొందుతున్నాడు అని ఒకసారి, లేదా ఆయన కి అసలు నటన అంటే ఆసక్తి లేదు, ఆయన చదువుకుంటున్నాడు అని ఇంకోసారి ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈ ఏడాదైనా మోక్షజ్ఞ సినిమా మీద ఏదైనా ప్రకటన ఉంటుందని ఆశిస్తున్న నందమూరి అభిమానులకు షాక్ ఇచ్చాడు మోక్షజ్ఞ. నిన్న తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు లో చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో బాలయ్య మోక్షజ్ఞ ఇద్దరూ రహస్యంగా పూజలు చేశారు, అయితే ఈ విషయాన్ని ఎంత గోప్యంగా ఉంచుదాం అనుకున్నా అది కుదరలేదు. మోక్షజ్ఞ పిక్స్ కొన్ని తీసిన స్థానికులు సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. అయితే ఇందులో షాక్ ఏముంది అనుకోకండి, ఆ పిక్స్ లో మోక్షు అలా ఉన్నాడు, ఏమాత్రం ఫిట్ గా లేకుండా ఉన్నారు. దీంతో అభిమానులు ఈ ఏడాది కూడా మోక్షఙ్ఞ ఎంట్రీ లేదని బెంగ పెట్టుకున్నారు.