దిల్ రాజు వర్గం మీద పై చేయి సాధించిన సీ కళ్యాణ్ వర్గం

పోటాపోటీగా జరిగిన తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు ముగిశాయి. ప్రొడ్యూసర్ సెక్టార్‌కు సంబంధించి జరిగిన ఈ ఎన్నికల్లో సి.కళ్యాణ్, దిల్ రాజుకు చెందిన ప్యానెల్స్ పోటీ పడ్డాయి. ఈ ఎన్నికల్లో 12మంది ఈసీ సభ్యులలో సి.కళ్యాణ్‌కు చెందిన మన ప్యానెల్ నుంచి 9 మంది ఎన్నికయ్యారు. దిల్ రాజుకు చెందిన ప్యానెల్ నుంచి ఇద్దరు ఎన్నిక అయ్యారు. అలాగే 20 మంది సెక్టార్ సభ్యుల్లో సి.కళ్యాణ్‌కు చెందిన 16 మంది గెలిచారు. ఇక దిల్‌రాజు ప్యానెల్ నుంచి 4 గెలిచారు. ఈసీ సభ్యులుగా దిల్‌రాజు, దామోదర్ గెలుపొందగా స్వతంత్య్ర అభ్యర్ధిగా మోహన్ గౌడ గెలిచారు. ఫిలిం చాంబర్లో నిర్మాతలు, స్టూడియో యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భాగస్వాములుగా ఉన్నారు. నాలుగు విభాగాల్లో ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఒక్కో విభాగం నుంచి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం గత కొన్నేళ్ళుగా సంప్రదాయంగా వస్తోంది. ఈ సారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎగ్జిబిటర్స్ విభాగం నుంచి నారాయణ దాస్ నారంగ్‌ను ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్లుగా దిల్ రాజు, ముత్యాల రామదాసులను, సెక్రటరీగా దామోదర్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా నట్టికుమార్, భరత్ చౌదరిలు, ట్రెజరర్ గా విజయేందర్ రెడ్డిలు ఎన్నికయ్యారు.