English   

బిగ్ బాస్ మొదటి ఎలిమినేషన్ హేమదే !

hema
2019-07-28 10:06:12

కింగ్ నాగార్జున ఆధ్వర్యంలో నడుస్తున్న  బిగ్ బాస్ సీజన్ 3 మొదటి వారం పూర్తైంది. అయితే మునుపెన్నడూ లేనట్టుగా ఈసారి మొదటి వారం నుండే ఎలిమినేషన్ ఉండడంతో కంటెస్టెంట్ల గుండెల్లో గుబులు మొదలయింది. ఎందుకంటే ఈ 15 మందిలో ఈరోజు ఒకరు ఎలిమినేట్ అవుతునారు. హోస్ట్ నాగార్జున దగ్గరుండి మారీ వీరిని సాగనంపే కార్యక్రమం ఉండటంతో తొలివారం ఎలిమినేట్ అయ్యేదెవరన్నదానిపై బుల్లితెర ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంది. ఈవారం ఎలిమినేషన్ కి  గాను ఎలిమినేషన్ కొరకు మొత్తం ఆరుగురు సభ్యలు నామినేట్ కావడం జరిగింది. వారిలో నటి హేమ,మరో నటి హిమజ, పూర్ణవి భార్గవి, సింగర్ రాహుల్ సిప్లిగుంజి, టీవీ9 యాంకర్ జాఫ్ఫర్ తోపాటు హీరో వరుణ్ సందేశ్ వైఫ్ వితికా షేరు ఉన్నారు. ఇప్పుడు వీరిలో అతితక్కువ ఓట్లు సంపాదించిన వారు ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే ఈ ఆరుగురిలో నుంచి హిమజ, పునర్నవి సేఫ్ అయినట్టు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న నాగార్జున ప్రకటించారు. ఇక మిగిలిన వారిలో హేమ అంటేనే కంటెస్టెంట్స్ అందరిలో అధిక వ్యతిరేకత ఉంది. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి హేమ అందరినీ డామినేట్ చేస్తూ వచ్చిందని నాగ్ స్పెషల్ గా సెటైర్ వేయడం ఇప్పుడు మరింత ఊతం ఇస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, ఈరోజు హేమ ఎలిమినేట్ కానుందని అంటున్నారు. ఇక హేమ ఇవాళ ఎలిమినేట్ అవుతుందా? లేదా అనేది తెల్సుకోవాలి అంటే రాత్రి వరకూ ఆగాల్సిందే.

More Related Stories