English   

తెలుగు బిగ్‌ బాస్‌ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న తమన్నా !

biggboss
2019-07-28 10:39:44

కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3  వారం పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 1, 2లు బుల్లితెరపై రేటింగ్స్‌ను కొల్లగొట్టగా సీజన్ 1 కంటే సీజన్ 2లో కాస్త ఊపు తగ్గింది. కంటెస్టెంట్స్ వీక్‌గా ఉండటంతో పాటు నాని హోస్టింగ్ ఎన్టీఆర్ కంటే మెరుగ్గా లేకపోవడంతో ఆడియన్స్ ఊహించినంత ఎంటర్‌టైన్మెంట్‌ను అందించలేకపోయింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 3ని బాధ్యతల్ని తీసుకున్న నాగార్జున మనసు కోతి లాంటిది మరి అలాంటి మనసున్న కొంతమంది మనుషులు ఒక ఇంట్లో చేరితే మమకారంతో వెటకారంతో వాళ్లను ఏకతాటిపైకి తీసుకువచ్చేది ఎవరు అంటూ నాగార్జున తనదైన మార్క్ వేసుకుంటున్నారు. తొలివారం నామినేషన్‌లో ఎలిమినేషన్ కోసం సింగర్ రాహుల్, నటి పునర్నవి, హేమ, హిమజ, జాఫర్, వితిక నామినేట్ అయ్యారు. ఈ వారం షో నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయం మీద ఆసక్తి నెలకొని ఉంది. అయితే అందుతున్న సమాచారం ప్రకం ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి  బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. ట్రాన్స్‌జెండర్ అయిన తమన్నాను తీసుకోవడం ద్వారా షోలో ఇంట్రస్ట్ పెంచాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేశ్‌ మీద స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి వార్తల్లో నిలిచిన తమన్నా సింహాద్రి, శ్రీ రెడ్డి విషయం క్యాస్టింగ్ కోచ్ విషయంలో కూడా మీడియా ముందు కూడా హాట్ టాపిక్‌గా నిలిచింది. ఆమె కృష్ణా జిల్లా అవనిగడ్డకి చెందిన వారు.

More Related Stories