అమెరికా పారిపోతుండగా శివాజీ పట్టివేత...అసలు నిజం ఏంటంటే ?

అలంద మీడియా కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు శివాజీకి దుబాయ్ విమానాశ్రయంలో మరోసారి చేదు అనుభవం ఎదురైందని నిన్న రాత్రి ప్రచారం జరిగింది. దుబాయ్ మీదుగా అమెరికా వెళుతున్న ఆయన్ని ఈ నెల 26న దుబాయ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. శివాజీపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ అమెరికా వెళ్ళబోయిన ఆయన్ని తిరిగి హైదరాబాద్ పంపించేశారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాల విషయంలో శివాజీ స్పందించారు. దుబాయ్ అధికారులు ఆపడానికి నేనేమైనా అంతర్జాతీయ ఉగ్రవాదినా ? అని ప్రశ్నించిన ఆయన తాను హైదరాబాద్లోనే ఉన్నా, ఎందుకు ఇలాంటి తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంటే సీపీ సజ్జనార్ ఏం చేస్తున్నారని శివాజీ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు చేతగాని వాళ్లయి దుబాయ్ పోలీసులు పట్టుకున్నారని టీవీ9 వాళ్లు కథనం ప్రసారం చేశారని ఆ వార్తల సారాంశమా అని ఆయన ప్రశ్నించారు. గత ఏపీ ప్రభుత్వం తనకి ఇచ్చిన సెక్యూరిటీని ప్రభుత్వం మారగానే తొలగించారని, నాకు మైహోమ్ రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి నుంచి ప్రాణహాని ఉంది, భద్రత కల్పించాలని సీఎం జగన్ ను ని కోరారీనా ఆయన పట్టించుకోరని, కనకపు సింహాసనం పైన శునకాన్ని కూర్చోబెడితే అది సింహం కాదని ఆయన మర్శించారు. మీరు చంపేసినా సరే మా శవం మిమ్మల్ని చూసి నవ్వుతుందని శివాజీ ఘాటుగా వ్యాఖ్యానించారు.