English   

డియర్ కామ్రేడ్ సెకండ్ డే కలెక్షన్స్

vijay
2019-07-28 11:28:34

విజయ్ దేవరకొండ హీరోగా ఆయన హిట్ జోడీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా విడుదలైన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంది. సినిమా చాలా బోరింగ్ అనే టాక్ బయటికి వచ్చినప్పటికీ, మంచి మెసేజ్ తో పాటు బాబి, లిల్లీల సయ్యాట ఆడియన్స్ కి కనెక్ట్ అయినట్టే ఉంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 9.68 కోట్ల షేర్ ని వసూల్ చేసిన డియర్ కామ్రేడ్ సినిమా రెండో రోజు కలెక్షన్స్ కోసం కష్టపడాల్సి వచ్చింది. రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కలెక్షన్స్ నిరాశ పరిచాయనే చెప్పాలి. వరల్డ్ వైడ్ గా 5 కోట్ల లోపు షేర్ ని 2 వ రోజునే అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి నిర్మాతలు మొదటి రోజే 11.14 కోట్ల షేర్ అందుకుందని అనౌన్స్ చేశారు. 2 రోజులు కలిపి ఎంత అనౌన్స్ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. చూడాలి మరి నిర్మాతలు ఎంత అనౌన్స్ చేస్తారో ?

More Related Stories