English   

అల్లు అర్జున్ మీద నెగటివ్ ప్రచారం...లాజిక్ లెస్....స్పందించిన మెగాటీమ్ !

allu
2019-07-28 13:35:40

మెగా కాంపౌండ్ లోని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ మీద ఈ మధ్య మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబందించి షూటింగ్ లో బన్నీ ఒక కో డైరెక్టర్‌ తో గొడవ పెట్టుకున్నాడని వార్తలు వచ్చాయి. సినిమా కూడా ఆగిపోయిందని ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఈ విషయం మీద టబు షూట్ లో జాయిన్ అయిందంటూ తెలివిగా ఆ విషయం పక్కన పెట్టినా, బన్నీ కొత్తగా కొన్న కారవాన్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్‌ వేసినట్టు, ఆ తర్వాత లోకేషన్‌లో బన్నీ డిమాండ్‌ లు నిర్మాతలకు తలనొప్పిగా మారాయని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే అలా ప్రచారం చేస్తున్న వారు మిస్సవుతున్న లాజిక్ ఏంటంటే అసలు బన్నీ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమాని నిర్మించేది, ఒకటి గీతా ఆర్ట్స్ అయితే మరొకరి త్రివిక్రమ్ కి సొంత సంస్థ లాంటి హారికా హాసినీ క్రియేషన్స్ అలాంటిది ఆ నిర్మాతలను ఆయన ఇబ్బంది పెడుతున్నారు అంటూ లాజిక్ లెస్ ప్రచారం మొదలెట్టారు. అయితే తాజాగా ఈ నెగెటివ్‌ వార్తలపై మెగా ఫ్యామిలీ పీఆర్వో, టాక్సీవాలాతో నిర్మాతగా మారిన ఎస్కేఎన్‌ స్పందించారు. డియర్ ఇన్విజిబుల్ ఎనిమీ అంటూ సంభోదించిన ఆయన అల్లు అర్జున్‌ పై జరుగుతున్న దుష్ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. పద్దెనిమిదేళ్లుగా అల్లు అర్జున్‌ ఎంతో కష్టపడి, శ్రమించి తెచ్చుకున్న స్టార్‌ ఇమేజ్‌ను కొన్ని వార్తలు తగ్గించలేవు. అంకితభావం, సాయం చేసే మనస్థత్వం ఆయన్ని ఎప్పుడూ అభిమానులకు మరింత చేరువ చేస్తుంది. చివరకు ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం. ప్రస్తుతం ఏఏ19 చిత్రీకరణ జరుగుతోంది అదే సమయంలో తదుపరి రెండు చిత్రాల ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి అంటూ ట్వీట్ చేశారు ఎస్కేఎన్‌.

More Related Stories