English   

అర్జున్ సురవరం రిలీజ్ అప్పుడేనట !

nikil
2019-07-28 14:22:18

యువ హీరోల్లో మంచి హిట్స్ తో ఫాంలో ఉన్న నిఖిల్ ఒకరు. అయితే ఈ యువ హీరో సినిమా రిలీజ్ చేసి చాలా కాలం అయింది. ఆయనకి అసలు ఈ మధ్య టైం బాగున్నట్టు లేదు. అయితే ముద్ర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూసినా వేరే సినిమా అదే పేరుతో రిలీజ్ కావడంతో కొంత వివాదం చేసుకుని మరీ వెనక్కి తగ్గాడు. అయితే పేరు మార్చుకుని అర్జున్ సురవరం పేరుతో విడుదలకు సిద్ధమైనా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కారణంగా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీ కానీ దేని మీద కానీ క్లారిటీ లేదు. అయితే ఈ సినిమా విడుదల గురించి ఎప్పుడెప్పుడా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పటి దాకా స్పందించని నిఖిల్ ఇప్పుడు తాజాగా స్పందించారు. ట్విట్టర్ లో అభిమానుల నుంచి ఈ సినిమా గురించే పెద్దగా డిమాండ్స్ వినిపించడంతో ఎట్టకేలకి నిఖిల్ అర్జున్ సురవరం విడుదల గురించి స్పందించాల్సి వచ్చింది. అర్జున్ సురవరం సినిమా పెద్దన్న సాహో సినిమా విడుదల అనంతరం రిలీజ్ కాబోతోంది అని నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. తేదీ ప్రకటించలేదు కానీ ఈ సినిమా మాత్రం సెప్టెంబర్ లో రానుందని నిఖిల్ హింట్ ఇచ్చాడన్న మాట

More Related Stories