English   

వామ్మో మహేష్ కోసం ఏకంగా ఆ సెట్ వేస్తున్నారా ?

mb
2019-07-28 15:58:16

మహేష్ బాబు ఒక్కడు, అర్జున్ లాంటి సినిమాలు చేసినప్పుడు ఆ సినిమా కంటెంట్ విషయం కంటే మరో విషయానికి బాగా ఫేమస్ అయ్యాయి. అదేంటంటే సెట్ లు, ఈ సినిమాల కోసం రెండు చారిత్రిక కట్టడాలను సెట్ లుగా వేశారు.  అవే ఒక్కడులో చార్మినార్ సెట్ మరియు అర్జున్ లోని మదురై మీనాక్షి ఆలయం సెట్. నిజానికి అదే టైంలో ఒక్కడు సినిమా కోసమే మహేష్ కర్నూలులోని ‘కొండారెడ్డి బురుజు’ వద్ద షూట్ చేశాడు. కాని ఆయన అప్పుడు చిన్న హీరో కావడంతో, క్రౌడ్ కంట్రోల్ విషయంలో ఎటువంటి సమస్య రాలేదు. ఇప్పుడు అతను సూపర్ స్టార్, ఆ బురుజు వద్ద ఇప్పుడు షూటింగ్ సాధ్యం కాదు. అందుకే మహేష్‌ నటిస్తున్న తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' కోసం కొండా రెడ్డి బురుజు సెట్ నే నిర్మిస్తారని అంటున్నారు. ఇప్పటికే కశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో హైదరాబాద్‌ షెడ్యూల్ షూట్ కి వెళ్లనుంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు అనిల్ సుంకరలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మేజర్‌ అజయ్‌కృష్ణ పాత్రలో మహేష్‌ కనిపించనున్నారు.

More Related Stories