చిరంజీవి సైరా కోసం చరణ్ ప్రమోషన్ ప్లాన్ !

చిరంజీవి హీరోగా నటిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా తొలితరం తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాడలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందుతోంది. సురేందర్‌రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. చిరు సతీమణి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ మీద ఆయన కొడుకు రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మొదట రెహమాన్ సంగీతం అందించాల్సి ఉండగా ఆయన అనూహ్యంగా తప్పుకోగా అమిత్ త్రివేది స్వరాలు సమకూరుస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుందని అంటున్నా ఆ విషయాన్ని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనులతో పాటు డీఐ వర్క్ కూడా జరపుకుంటోంది. అయితే ఈ ట్రైలర్ మెగాస్టార్ పుట్టిన రోజున రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక అప్డేట్ వినిపిస్తోంది. అదేంటంటే ఈ సినిమా ట్రైలర్ ను సైమా వేడుకల్లో రిలీజ్ చేయాలని చరణ్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే ఖతార్ లోని దోహా వేదికగా ఆగస్ట్ నెల 15 మరియు 16 తేదీలలో సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారట. ఈ నేపధ్యంలో ఆ వేడుకలోనే చిత్ర ట్రైలర్ ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. హిందీతో పాటు సౌత్ లోని పలు భాషలలో విడుదల కానున్న సైరా మూవీ ట్రైలర్ ని ఇలాంటి అంతర్జాతీయ వేదిక ద్వారా ప్రమోట్ చేయడం కలిసి వస్తుందని అంటున్నారు. అమితాబచ్చన్, తమన్నా, విజరు సేతుపతి, కిచ్చ సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంగా విడుదల కానుంది.