English   

ఆర్ఆర్ఆర్ విషయంలో డెసిషన్ మార్చుకున్న జక్కన్న

mouli
2019-07-28 16:41:05

తెలుగు సినీమాల్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న వాటిలో ఆర్ఆర్ఆర్ ఒకటి. ఈ సినిమా మొదలయిన నాటి నుండి ప్రతి రోజు ఏదో ఒక విధంగా ఈ సినిమా మీడియాలో నానుతూనే ఉంది. సినిమా క్యాస్టింగ్ మొదలు అన్ని విషయాల్లో కూడా ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. గాయాలు పాలయిన ఇద్దరు హీరోలూ చక్కగా ఫాంలోకి వచ్చారు కాబట్టి ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుందని భావించారు. కానీ ఏదో ఒక కారణం వలన ఈ సినిమా వాయిదా పడుతూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ హైదరాబాద్ లో జరుగుతుండగా ఈ సినిమా త‌దుప‌రి షెడ్యూల్ పూణేలో ప్లాన్ చేశారు. అయితే అక్క‌డ షూటింగ్‌కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న‌ప్పుడ‌ల్లా ఏదో ఒక ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని అంటున్నారు. దాదాపు నెలరోజుల బట్టీ వర్షమే ఎదురవుతూ ఉంది. అందుకే రాజ‌మౌళి పూణేలో జ‌ర‌పాల్సిన షెడ్యూల్‌ని త‌మిళ‌నాడుకి మార్చేసారని అంటున్నారు. ఇప్ప‌టికే అక్కడికి వెళ్ళిన జక్కన్న అక్క‌డ ప‌లు లొకేష‌న్స్ ఓకే చేశాడ‌ని, దాదాపు 35 రోజుల పాటు అక్క‌డ షూటింగ్‌ జ‌రిపేందుకు టీమ్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ షెడ్యూల్ లో చ‌ర‌ణ్ - ఎన్టీఆర్‌పై కీల‌క సీన్స్ తెరకెక్కిస్తార‌ట‌. జూలై 30, 2020న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

More Related Stories