English   

అలీకి కీలక పదవినిచ్చిన జగన్ !

jagan
2019-07-28 21:02:24

గత ఎన్నికల ముంగిట రకరకాల ప్రచారాల మధ్య ప్రముఖ హాస్య నటుడు అలీ జగన్ గూటికి చేరిన సంగతి తెల్సిందే. అంతకు ముందు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో, తనకు అత్యంత సన్నిహితుడు అయిన జనసేన అధినేత పవన్ తో కూడా చర్చలు జరపడంతో ఆయన రాజకీయ జీవితం మీద మీద కాస్త సందిగ్థత నడిచినా ఆయన బేషరతుగా జ‌గ‌న్ చెంత చేరారు. అప్పట్లో పార్టీలో స‌ముచిత స్థానం ఇవ్వ‌డంతో పాటు ఎమ్మెల్సీ కూడా ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్లు ప్రచారం జరిగింది. అయితే మంత్రిని చేసే పార్టీలోనే ఇదివరకు చేరతానని ప్రకటించిన విషయాన్ని ఒక మీడియా ప్రతినిది అలీ పార్టీలో చేరిన సందర్భంలో అడుగగా ఇప్పటికీ అదే మాట మీద ఉన్నానని అలీ అన్నారు.అయితే ఎమ్మెల్సీ మంత్రి పదవి ఏమో కానీ జగన్ మాత్రం అలీకి తాజాగా ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర నాటక చలనచిత్ర నాటక మండలి చైర్మన్ (ఏ.పి.ఎఫ్.డీ.సీ) గా పదవిని ప్రకటించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పదవి ఆయనకు కేటాయిస్తున్నట్లు అధికారిక ప్రకటన కానీ ఉత్తరువులు కానీ ఇంకా వెలువడినట్లు సమాచారం లేదు. అయితే ఈ విషయం మాత్రం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

More Related Stories