English   

కొబ్బరి మట్ట కోసం సంపూ వరల్డ్ రికార్డ్ !

 Sampoornesh Babu
2019-07-29 07:32:19

హృదయ కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బర్నింగ్ స్టార్ గా పరిచయం అయిన సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మూడో చిత్రం ‘కొబ్బరి మట్ట’. మొదటిది హృదయ కాలేయం కాగా రెండవది సింగం 123, ఇప్పుడు కొబ్బరి మట్ట సినిమాతో మనముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో సంపూ మూడు విభిన్న పాత్రల్లో నటించారు. ఒకటి పాపారాయుడు, మరొకటి పెదరాయుడు కాగా ఇంకొకటి ఆండ్రాయిడు. ఇప్పటికే పాపారాయుడు, పెదరాయుడు పాత్రలను పరిచయం చేయగా నిన్న ఆండ్రాయిడుతో ప్రపంచ సినీ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ టేక్ డైలాగ్ చెప్పించి దానినే ఒక ట్రైలర్ గా వదిలారు. తాజాగా విడుదలైన ఆండ్రాయిడు పరిచయ ట్రైలర్‌లో 3.27 నిమిషాల నిడివితో నాన్ స్టాప్ డైలాగ్ ఉంది. ఈ డైలాగును సంపూర్ణేష్ బాబు సింగిల్ టేక్‌లో చెప్పాడట. ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ సంపూర్ణేష్‌ను ఆండ్రాయిడ్‌గా పరిచయం చేస్తూ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ డైలాగ్ చెప్పడానికి పదిరోజుల పాటు ప్రాక్టీస్ చేశానని సంపూ చెబుతున్నాడు. ఈ సినిమాని రూపక్ రోనాల్డ్సన్ తెరకెక్కించగా హృదయ కాలేయం డైరెక్టర్ స్టీవెన్ శంకర్ నిర్మించారు. కమ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆగస్టు 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరింకెందుకు ఆలస్యం ఈ ట్రైలర్ మీద మీరూ ఒక లుక్ వేసెయ్యండి.

More Related Stories