English   

శర్వానంద్ కోసం కాకినాడకి అల్లు అర్జున్ !

allu arjun
2019-07-29 08:09:10

యువ డైరెక్టర్ సుధీర్‌వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా నటించిన తాజా చిత్రం రణరంగం. కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా షూట్ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే రిలీజ్ కి ప్లాన్ చేశారు. అయితే ముందు ప్రకటించిన దాని ప్రకారం అయితే ఆగస్టు 2న ఈ సినిమాను విడుదల చేయాలి. అయితే ఏమి కారణాలు ఉన్నాయో ఏమో కానీ ఈ సినిమాని ఏకంగా రెండు వారాలు పోస్ట్ పోన్ చేసి మరీ సాహూ ఖాళీ చేసిన డేట్ ని ఫిక్స్ చేసుకుంది. అలా ఆగష్టు రెండున రిలీజ్ కావాల్సిన సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్‌ గా నటించగా ఆయన సరసన కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ లు హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ సినిమా మీద మరింత క్రేజ్ పెంచేందుకు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను త్వరలోనే నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రణరంగం ప్రీ రిలీజ్ వేడుకను ఆగస్టు 4న కాకినాడలో నిర్వహిస్తారని అంటున్నారు. ఈ వేడుకకు చీఫ్ గెస్టులుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరుకాబోతున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ సినిమా నిర్మించేది సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నాగవంశీ, ఈయన హారికా హాసినీ చినబాబు కుమారుడు, సో త్రివిక్రమ్ తో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ రమ్మని అడగ్గానే వెంటనే ఓకే చెప్పారని అంటున్నారు. ఇక ఈ సినిమాని సుధీర్ వర్మ తెరకేక్కిస్తున్నారు. అయితే కాకినాడలోనే ఎందుకు అంటే ఈ సినిమాలో ఎక్కివ భాగం అక్కడే షూట్ చేశారు, అందుకే ఈ ప్రీ రిలీజ్ అక్కడ ప్లాన్ చేశారని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. 

More Related Stories