బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ..

బిగ్ బాస్ నుంచి ఇలా బయటికి వచ్చిందో లేదో అప్పుడే ఆ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది హేమ. అక్కడున్నపుడు అంతా మంచోళ్లే అంటూ మాటలు చెప్పిన ఈమె.. బయటికి అడుగు పెట్టిన తర్వాత ఇష్టమొచ్చినట్లు కమెంట్ చేసింది. తనను మా టీవీ మోసం చేసిందని చెబుతుంది ఈమె. నాగార్జున ముందున్నపుడు అంతా బాగుంది.. అంతా హ్యాపీ అంటూ చెప్పుకొచ్చింది హేమ. ఇప్పుడు మాత్రం కావాలనే తనను ప్లాన్ చేసి మరీ బయటికి పంపించారని చెప్పడం సంచలనం. అసలు ఇంట్లో జరిగింది జరిగినట్లు చూపించడం లేదని ఆరోపిస్తుంది హేమ. తనపై ముందు నుంచి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెబుతుంది హేమ. అంతేకాదు మొదటి రోజు తనపై AV కూడా వేయలేదని ఆవేదన వెల్లగక్కింది ఈ నటి. లోపల జరిగిన గొడవ వేరని.. తానే వాళ్లకు సర్దిచెప్పానని.. కానీ అక్కడ మాత్రం తానే గొడవపడ్డట్టు ప్రసారం చేశారని చెప్పుకొచ్చింది హేమ. అదే తన కొంప ముంచిందంటుంది ఈమె. తనకు గూగుల్ లో ఎక్కువ ఓట్స్ వచ్చాయని.. కానీ హాట్ స్టార్ లో మాత్రమే ఓట్ వేయాలని క్లియర్ గా చెప్పలేదని చెబుతుంది హేమ. తనను ప్రమోట్ చేసేలా ప్రోమో వేస్తామని చెప్పి అది కూడా వేయలేదని మాటీవీపై అసహనం వ్యక్తం చేసింది ఈమె. దీనిపై మా టీవీ వాళ్లను అడిగినా కూడా ఈ విషయంలో తనకు క్లారిటీ రాలేదని చెబుతుంది. తనను అక్క అక్క అంటూనే.. తనపై లేనిపోని మాటలు చెప్పారని.. చాలా ప్లాన్డ్ గా తనను బయటకు పంపేలా చేసారని చెబుతుంది హేమ. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది కంటెస్టెంట్స్ ఇలా బయటికి వచ్చి రచ్చ చేస్తారో చూడాలి.