చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఆ భామ.. మరోసారి రొమాన్స్..

చిరంజీవి, కొరటాల సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సినిమా అక్టోబర్ నుంచి పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. దీనిపై ఆ మధ్య అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసింది కొణిదెల ప్రొడక్షన్ టీం. ఇప్పుడు ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటించబోతున్నారని ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. దీనికి సమాధానం మరోసారి సైరా హీరోయిన్ నే నటించబోతుందని తెలుస్తుంది. కొరటాల సినిమాలో కూడా నయనతార హీరోయిన్ గా నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా లైన్ లోకి వచ్చింది. చిరంజీవితో ఇదివరకు నటించిన కాజల్ మరోసారి ఈ సినిమాలో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఖైదీ నెం 150లో నటించిన ఈ భామనే మరోసారి తన సినిమాలో రిపీట్ చేయాలని చూస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇప్పటికే కథ కూడా సిద్ధమైపోయింది. ఈ చిత్రం నిరుద్యోగం నేపథ్యంలో తెరకెక్కబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో చిరంజీవి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. ప్రభుత్వంపై సెటైర్లు వేసే విధంగా ఈ పాత్రను కొరటాల డిజైన్ చేస్తున్నాడని తెలుస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటానని కనిపిస్తున్నాడు మెగాస్టార్. అన్ని కమర్షియల్ హంగులతో కొరటాల శివ, చిరంజీవి సినిమా రాబోతుంది. 2020లో సినిమా విడుదల కానుంది. మొత్తానికి చూడాలి కొరటాల శివ సినిమాలో చిరంజీవితో ఎవరు జోడి కట్టబోతున్నారో..?