డియర్ కామ్రేడ్ కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు షాక్..

విజయ్ దేరవకొండ సినిమా వచ్చిందంటే కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడం తప్ప వెనుదిరగడం లేదు. ఆయన సినిమాలకు అడిక్ట్ అయిపోతున్నారు కుర్రాళ్లు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్నాడు ఈ కుర్రాడు. ఇలాంటి సమయంలో విడుదలైన డియర్ కామ్రేడ్ సినిమాపై అంచనాలు కూడా ముందు నుంచి భారీగానే ఉన్నాయి. కానీ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో చాలా ఏళ్ల తర్వాత విజయ్ దేవరకొండకు షాక్ తగిలింది. ఈ సినిమా తొలిరోజే 11.5 కోట్ల షేర్ వసూలు చేసినా కూడా ఆ తర్వాత రెండు రోజుల్లో పడిపోయింది. మూడు రోజులకు కలిపి ఇప్పుడు కేవలం 18 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తుంది. రెండో రోజుకే చాలా చోట్ల కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. నెగిటివ్ టాక్ ప్రభావం అన్ని చోట్లా కనిపించింది. మిగిలిన భాషల్లో కూడా ఈ సినిమాకు ఊహించిన వసూళ్లు రావడం లేదు. దాంతో అన్ని భాషల్లోనూ డియర్ కామ్రేడ్ నిరాశ పరచడం ఖాయం అయిపోయింది. ఈ సినిమా సేఫ్ కావాలంటే అక్షరాలా 34 కోట్లు రావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చిత్రానికి ఇంత రావడం దాదాపు అసాధ్యం. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ అద్భుతం అంత ఈజీ కాదు. దాంతో మొత్తానికి చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ ఫ్లాప్ అనే మాట వినక తప్పడం లేదు. ఇప్పుడు ఈ కుర్ర హీరో ఆశలన్నీ క్రాంతి మాధవ్ సినిమాపైనే ఉన్నాయి. మరి ఆ సినిమాతో ఏం చేస్తాడో చూడాలిక.