English   

మాజీ సీఎం కొడుకుతో బోయపాటి భారీ బడ్జెట్ మూవీ ?

 Boyapati Srinu
2019-07-29 16:51:09

ఒకప్పుడు చిన్న హీరోలు నుండీ పెద్ద హీరోల దాకా బోయపాటితో సినిమా చేయడం ఒక కల, ఎందుకంటే ఆయనకున్న ట్రాక్ రికార్డ్ అలాంటిది. కానీ మొన్న సంక్రాంతికి వచ్చిన వినయవిధేయరామ సినిమా ఆ ఇమేజ్ ని చెరిపేసింది. దీంతో ఇక ఆయన పని అయిపొయింది అన్నారు చాలా మంది. బాలయ్యతో ప్రకటించిన సినిమా కూడా వెనక్కి వెళ్ళడంతో ఆయన ఇక పనికిరాడని మాట్లాడారు కొంత మంది. అయితే అలా మాట్లాడిన వారందరికీ షాక్ ఇస్తూ ఏఎ మధ్య కార్తికేయ హీరోగా నటించిన 'గుణ 369' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ లో అల్లు అరవింద్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో బోయపాటిని ఉద్దేశించి బోయపాటి సరైనోడుతో సూపర్ హిట్ ఫిల్మ్ ఇచ్చారని, మా కాంబినేషన్‌లో మళ్లీ ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నామని ప్రకటించారు. అయితే అల్లు అరవింద్ ప్రకటనతో బోయపాటి మళ్లీ మెగా కాంపౌండ్‌ లోకి అడుగు పెట్టబోతున్నాడని అన్నారు. అయితే బన్నీ ఇప్పటికే మూడు సినిమాలు ఒప్పుకోవడం, చిరంజీవి మూడు సినిమాలు కమిట్ అవడం, చరణ్ ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉండడంతో వాళ్లతో సినిమా అంటే అయ్యే పని కాదు. మరి బోయపాటితో ఎవరిని పెట్టి సినిమా తీస్తారు. ఏదో పాపం మార్కెట్ లేక ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి అలా చెప్పి ఉండచ్చని కూడా ప్రచారం జరిగింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను కన్నడ హీరో నిఖిల్ గౌడతో సినిమా చేయాలని ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. నిఖిల్ గౌడ అంటే ఎవరో కాదు, కర్ణాటక తాజా మాజీ సీఎం. నిఖిల్ గతంలో కొన్ని సినిమాలు చేశాడు. మూడేళ్ళ క్రితం భారీ బడ్జెట్ పెట్టి మతీ జాగ్వార్ సినిమా చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో మాండ్య లోక్ సభ నుండి ఎంపీగా పోటీ చేసి సుమలత చేతిలో ఓడిపోయిన ఆయన వరస సినిమాలు చేసి క్రేజ్ పెంచుకునే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. మంచి మాస్ డైరెక్టర్ ఎవరా వెతుకుంటే బోయపాటి పేరు వరుసలో ముందు ఉందని ఈ ప్రాజెక్ట్ ని అల్లు అరవింద్ చేపట్టనున్నాడని అంటున్నారు. ఇందులో నిజం ఎంతుందనేది వేచి చూడాలి. 
 

More Related Stories