English   

పూరీ జ‌గ‌న్నాథ్, విజ‌య్ దేవ‌ర‌కొండ దారిలో మ‌హేష్ బాబు.. 

Mahesh Babu
2019-07-29 17:28:41

మ‌హేశ్ గురించి ముందే ఊహించాడేమో పూరీ జ‌గ‌న్నాథ్.. అందుకే ఐదేళ్ల ముందే బిజినెస్ మ్యాన్ సినిమా సూప‌ర్ స్టార్ తో చేసాడు పూరీ. ఇప్పుడు ఈ టైటిల్ కు త‌గ్గ‌ట్లే ఇటు సినిమాలు.. అటు బిజినెస్ లో దూసుకెళ్తున్నాడు సూప‌ర్ స్టార్. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు సినిమాలు త‌ప్ప మ‌రో ప్ర‌పంచం లేద‌ని చెప్పిన మ‌హేశ్.. ఇప్పుడు ఒక్కొక్క‌టిగా త‌న సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తూ వెళ్తున్నాడు. ఇప్ప‌టికే ఏషియ‌న్ ఫిల్మ్ ఓన‌ర్ సునీల్ నారంగ్ తో క‌లిసి మ‌ల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగాడు మ‌హేష్. అక్క‌డ బాగానే సంపాదిస్తున్నాడు. ఇందులో 150 కోట్ల‌కు పైగా పెట్టుబ‌డి పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌ల్టీప్లెక్సుల‌తో పాటు కాస్మోటిక్స్ వ్యాపారంలోకి కూడా అడుగు పెడుతున్నాడు. ఇప్ప‌టికే తాను చాలా కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడు. 

ఇందులోనే ఓ టాప్ కంపెనీతో క‌లిసి టై అప్ అవుతున్నాడు మ‌హేశ్. ఇందులో మ‌హేశ్ వాటా 70 కోట్లుగా తెలుస్తోంది. ఈ రెండు బిజినెస్ ల‌తో పాటు ఇప్పుడు మ‌రో బిజినెస్ కూడా మొద‌లు పెడుతున్నాడు సూప‌ర్ స్టార్. అదే క్లోతింగ్ బిజినెస్. ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ రౌడీ బ్రాండ్ వేర్ అంటూ ర‌ప్ఫాడిస్తున్నాడు. మొన్నీమ‌ధ్యే పూరీ జ‌గ‌న్నాథ్ కూడా బీ ఇస్మార్ట్ అంటూ బ‌ట్ట‌ల షాప్ ఆన్ లైన్ లో ఓపెన్ చేసాడు. ఇక ఇప్పుడు హంబుల్ అంటూ మ‌హేష్ బాబు కూడా కొత్త కంపెనీ షురూ చేస్తున్నాడు. బ‌ట్ట‌ల బిజినెస్ తో పాటు మ‌రికొన్ని బిజినెస్ ల‌పై కూడా మ‌హేశ్, న‌మ్ర‌తా శిరోద్క‌ర్ క‌న్నేసిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి ఓ వైపు సినిమా రంగంలో సూప‌ర్ స్టార్ గా వెలిగిపోతూనే.. మ‌రోవైపు బిజినెస్ లోనూ దుమ్ము దులిపేయాల‌ని చూస్తున్నాడు మ‌హేశ్ బాబు.

More Related Stories