English   

మోక్ష‌జ్ఞ ఎందుకు ఇలా చేస్తున్నాడు.. న‌ట‌న అంటే ఆస‌క్తి లేదా..? 

Nandamuri Mokshagna
2019-07-29 18:20:49

ఇప్ప‌ట్లో వార‌సులు ఎవ‌రూ ఇండ‌స్ట్రీకి రాకపోవ‌చ్చు.. ఒక్క నంద‌మూరి మోక్ష‌జ్ఞ త‌ప్ప‌. ఈయ‌న ఎంట్రీ కోసం నంద‌మూరి అభిమానులు కొన్నేళ్లుగా వేచి చూస్తున్నారు. జూనియ‌ర్ బాల‌య్య వ‌స్తాడు.. వ‌చ్చీ రాగానే బాక్సాఫీస్ తాట తీస్తాడు అనే ఊహ‌ల్లో ఉన్నారు అభిమానులు. పైగా నంద‌మూరి ఫ్యామిలీ అంటేనే మాస్.. వాళ్ల‌కు ఉన్నంత మాస్ ఫాలోయింగ్ మ‌రెవ‌రికీ ఉండ‌దు. ఒక్క సినిమా హిట్టైతే చాలు ఆటోమేటిక్ గా స్టార్స్ అయిపోతారు. సింహాద్రి ఎఫెక్ట్ తో ఇప్ప‌టికీ సూప‌ర్ స్టార్ గానే ఉన్నాడు ఎన్టీఆర్. ఇక బాల‌య్య సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్పుడో ఓ సారి హిట్ కొట్టినా..అది సాలిడ్ గా ఉంటుంది. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మ‌రో వార‌సుడు వ‌స్తున్నాడు. అత‌డే మోక్ష‌జ్ఞ‌. 13 ఏళ్ల కింద నంద‌మూరి ఫ్యామిలీ నుంచి వ‌స్తోన్న వార‌సుడు మోక్షు. క‌ళ్యాణ్ రామ్ త‌ర్వాత మ‌ళ్లీ కొత్త హీరో ఎవ‌రూ రాలేదు. అఖిల్ 20 ఏళ్ల‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చేసాడు. చ‌ర‌ణ్ కూడా అప్ప‌ట్లో 22 ఏళ్ల‌కే హీరో అయ్యాడు.. బ‌న్నీ అయితే మ‌రీ 18 ఏళ్ల‌కే వ‌చ్చేసాడు.. నాగ‌చైత‌న్య 22 కు వ‌చ్చాడు. ఇప్పుడు మోక్ష‌జ్ఞ కూడా 20 ల్లోకి వ‌చ్చేసాడు. దాంతో త‌న‌యుడిని హీరో చేస్తున్నాడు బాల‌య్య‌. 2018 లోనే మోక్షును హీరో చేస్తాన‌ని చెప్పాడు బాల‌య్య‌. కానీ త‌న సినిమాల‌తో బిజీగా ఉండి కొడుకు సంగ‌తి మ‌రిచిపోయాడు. 

ఇప్పుడు ఈ ఎంట్రీ 2020కి వెళ్లిపోయింది. ఈయ‌న సినిమా ఎప్పుడు ఉన్నా కూడా సాయికొర్ర‌పాటి తానే నిర్మిస్తాన‌ని చెప్పాడు. అయితే కొన్ని రోజులుగా మ‌రో సంచ‌ల‌న విష‌యం బ‌య‌టికి వ‌స్తుంది. అస‌లు మోక్షుకు న‌ట‌న అంటే ఆస‌క్తి లేద‌ని.. ఆయ‌న వ్యాపారం చేయాల‌నుకుంటున్నాడ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈయ‌న ఫోటోలు కొన్ని బ‌య‌టికి వ‌చ్చాయి. అస‌లు హీరోకు కావాల్సిన ఒక్క ల‌క్ష‌ణం కూడా అందులో మోక్ష‌జ్ఞ‌లో క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం ఫిజిక్ మెయింట‌నెన్స్.. న‌ట‌న‌పై కూడా దృష్టి పెట్టిన‌ట్లు క‌నిపించ‌డం లేదు ఈ నంద‌మూరి వార‌సుడు. ఈ స‌మ‌యంలో మోక్షు ఎంట్రీ ఎప్పుడుంటుంద‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ కుర్రాడి త‌ర్వాత.. మ‌రో కొత్త వార‌సుడు రావ‌డానికి త‌క్కువ‌లో త‌క్కువ ప‌దేళ్లు ప‌ట్ట‌డం ఖాయం. ప‌వ‌న్ కొడుకు అఖీరానంద‌న్, మ‌హేశ్ త‌న‌యుడు గౌత‌మ్, వెంక‌టేశ్ కొడుకు అర్జున్.. వీళ్లందరి వ‌య‌సు ఇప్పుడు 10-12 ఏళ్లే. వీళ్లంద‌రూ హీరోలవ్వాలంటే మ‌రో ప‌దేళ్లు గ్యారెంటీ. మ‌రి ఈ కొత్త నంద‌మూరి వార‌సుడు ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తాడో చూడాలిక‌.

More Related Stories