English   

బాలీవుడ్ ప్రస్థానం టీజర్... రామాయణమా లేక మహాభారతమా ?

 Prasthanam
2019-07-30 08:15:11

శర్వానంద్, సాయి కుమార్, సందీప్ కిషన్ లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు దేవ కట్టా తెరకెక్కించిన సినిమా ప్రస్థానం. దాదాపు తొమ్మిదేళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకోవడమే కాక విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అదే టైటిల్‌తో బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. తెలుగు సినిమాకి ఏమాత్రం పొంతన లేకుండా ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మంచిని చేస్తే రామాయణం జరిగింది, అదే మంచిని దూరం చేస్తే మహాభారత యుద్ధం జరిగింది’ అనే డైలాగ్ తో ప్రారంభమయిన ఈ టీజర్ అంచనాలను పెంచుతోంది. అధికార వారసత్వం కోసం జరిగే అన్నదమ్ముల పోరాటం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరిదశ షూటింగ్ లో ఉంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజయ్ దత్ చివరిలో చెప్పిన ‘ఛాయిస్’ నీకే వదిలేస్తున్నా రామాయణమా లేక మహాభారతమా అనే డైలాగ్‌ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాలో మనీషా కొయిరాలా, అలీ ఫైజల్, జాకీ షరీఫ్, అమైరా దస్తూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

More Related Stories