English   

దిల్ రాజుతో చిరంజీవి సినిమా - క్రేజీ కాంబో ?

Chiranjeevi
2019-07-30 08:34:15

ఒకానొక సమయంలో సాదాసీదా హీరోలతో కూడా కుటుంబ కథా చిత్రాలు తీసి హిట్ కొట్టిన నిర్మాత దిల్ రాజు. కధని జడ్జ్ చెయ్యడం లో, సినిమాలు తియ్యడంలో మంచి టాలెంట్ ఉన్న నిర్మాత గా దిల్ రాజు కి మంచి పేరు ఉంది. కానీ గతేడాది ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. అయితే ఈ ఏడాది ఎఫ్ 2 తో మొదలు పెట్టిన ఆయన హిట్ ల పరపంపర కొనసాగుతూనే ఉంది. అయితే ఆయనకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తోంది. అదేంటంటే ఆయన మెగా స్టార్ తో కలిసి ఒక భారీ బడ్జట్ మూవీ ప్లాన్ చేసాడని అంటున్నారు. తమ సొంత ప్రొడక్షన్ కంపెనీ ఐన కొణిదెల ప్రొడ‌క్ష‌న్ లో ఇప్పుడు సైరా సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కొరటాల కాంబినేషన్ సినిమా కూడా అక్కడే ప్లాన్ చేశాడు. అయితే ఈ సినిమా అయ్యాక దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయాలని మెగా స్టార్ భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవలే మెగాస్టార్‌ని కలిసిన దిల్ రాజు ఆయనతో సినిమా చేయ్లాని ఉన్న మనసులో మాట చెప్పాడట. దీనికి చిరు కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వడంతో, త్వరలో ఆయనకోసం ఓ భారీ బడ్జెట్ స్క్రిప్ట్ తెస్తానని చెప్పాడట దిల్ రాజు. చిరు 153వ సినిమా దిల్‌రాజు బ్యానర్‌లో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమవనుందో ? 

More Related Stories