ఎన్ని కోట్లిచ్చినా ఆయనతో నటించను అంటున్న నయనతార

ఈ రోజుల్లో హీరోయిన్లు ముందుగా చూసేది రెమ్యూనరేషన్ కొరకే. రెండు కోట్లు ఎక్కువగా ఇస్తాను అంటే చిన్న హీరోలతో కూడా నటించడానికి వెనకాడరు. సాధారణంగా ఇప్పుడు వస్తున్న ముద్దుగుమ్మలు మొత్తం ముందు డబ్బులు.. ఆ తర్వాత పేరు ప్రఖ్యాతలు అంటున్నారు. కానీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో పాతకుపోయిన నయనతార లాంటి హీరోయిన్లకు ఇప్పుడు ప్రత్యేకంగా పేరు రావాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఉన్న ఇమేజ్ ను తమ కోసం వాడుకుంటున్నారు హీరోలు. అయితే డబ్బులు వస్తున్నాయి కదా అని ఏ సినిమాలో పడితే ఆ సినిమాలో నటించడానికి కూడా నయనతార ఓకే చెప్పడం లేదు. ఆమె ఓకే చెప్పాలంటే ముందు కథ నచ్చాలి.. ఆ తర్వాత హీరో కూడా నచ్చాలి.. హీరో ఆమెకు నచ్చకపోతే ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆ సినిమాలో నటించడానికి నయనతార ఓకే చెప్పదు. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఒక సినిమాలో ఈమెను నటింపజేయాలని నిర్మాతలు ఎంతగా ప్రయత్నించినా కూడా చివరికి నిరాశే ఎదురయింది. ఒకటి రెండు కాదు ఏకంగా 10 కోట్లు ఇస్తామని చెప్పినా కూడా నయనతార మాత్రం ఆ సినిమాలో నటించనని తెగేసి చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతగా నయనతార నో చెప్పిన ఆ హీరో ఎవరో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.. తమిళనాట శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. ఇప్పటికే తమన్నా, హన్సిక లాంటి స్టార్ హీరోయిన్లతో యాడ్లు షూట్ చేశాడు శరవణన్. ఇప్పుడు ఈయనకు హీరో కావాలనే కోరిక పుట్టింది. దాంతో తన తొలి సినిమా కోసం నయనతారను హీరోయిన్ గా అడిగితే ఆమె మొహం మీదే నో చెప్పేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నయనతార ఆయనతో నటించడానికి సిద్ధంగా లేదని.. 10 కోట్ల ఆఫర్ కూడా తృణప్రాయంగా వదిలేసుకుందని తెలుస్తోంది.