బాలయ్యకి లేడీ విలన్ గా మరో భామ !

గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా తర్వాత సరైన హిట్ పడలేదు బాలయ్యకి. జై సింహా అనే సినిమా చేసినా, తన తండ్రి జీవితాన్ని బయోపిక్ గా తెరకెక్కించినా అవి నిరాశ పరచాయి. అయితే ఆయన ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే ఫాం తప్పిన బోయపాటిని పక్కన పెట్టి మరీ కేఎస్ రవికుమార్ తో ఒక సినిమా ఒప్పుకున్నాడు. ఈ మధ్యనే పూజాధికాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రూలర్ అనే పేరుతో తెరకెక్కనుంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. దానికి ఊతం ఇస్తూ బాలయ్య ఇటీవల పుల్లేటికుర్రులో రహస్య పూజలు కూడా చేశారు. ఇక ఈ సినిమాలో కధానాయికలుగా సోనాల్ చౌహన్, వేదికలు నటిస్తారని తెలుస్తుండగా, భూమిక చావ్లా కీలక పాత్రలో కనిపించనుందని అంటున్నారు. ఈ విషయాలు వేటి మీదా ఇంకా సరయిన క్లారిటీ లేకపోగా తాజాగా ఈ సినిమా కోసం మరో భామ పేరు వినిపిస్తోంది. ముందు ఈ సినిమాలో లేడీ విలన్ గా తమిళ భామ వరలక్ష్మీ శరత్ కుమార్ ని ఫైనల్ చేయాలని మేకర్స్ అనుకున్నప్పటికి, బాలయ్య పక్కన ఆమె సూట్ కాదని భావించి ఆమె ప్లేస్ లో నమితను ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజం ఎంతుందో తెలీదుకానీ అదే నిజం అయితే ఆమె మళ్ళీ సినిమాల్లో బిజీ కావడం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే 2017లో పెళ్లి చేసుకున్న నమితకి ఆ తర్వాత తెలుగులో పెద్ద ఆఫర్స్ ఏవీ రాకపోవడంతో తమిళంలో పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తుంది.