English   

తిరునాళ్ళ సందడిలో వెంకీ మామ

Venky Mama
2019-07-30 16:14:41

వెంకటేశ్ నాగచైతన్యలు కథానాయకులుగా జై లవకుశ ఫేం బాబీ దర్శకత్వంలో వెంకీమామ సినిమా రూపొందుతోంది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్  చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తున్న ఈ సినిమాలో రైస్ మిల్లు ఓనర్ గా వెంకటేశ్, మిలటరీ ఆఫీసర్ గా చైతూ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్‌ ఇటీవలే కాశ్మీర్‌లో జరిగిందట. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. హైదరాబాద్‌ శివార్లలో వేసిన తిరునాళ్ల సెట్ లో మామాఅల్లుళ్ళు వెంకీ, చైతూ  ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ తిరునాళ్ళ సెట్ లో వీరితోపాటు ఐదువందల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లు కూడా పాల్గొంటున్నారు. ఈ సెట్ వన్ మామాఅల్లుళ్ళు ఒక ఫైట్‌ చేయనున్నారట. ఫైట్‌మాస్టర్‌లు రామ్‌-లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ఈ ఫైట్‌ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఎఫ్ 2లో వరుణ్ తేజ్ తో కలిసి మల్టీ స్టారర్ చేసి హిట్ కొట్టిన వెంకటేశ్ ఈసారి చైతూతోను కలిసి కూడా హిట్ కొడతాడో లేదో చూడాలి.

More Related Stories