English   

సాహో కు పెరుగుతున్న ప్రమోషన్స్.. మరో పాట విడుదల..

 Saaho
2019-07-30 18:00:38

విడుదల తేది దగ్గర పడుతుండటంతో సాహో దర్శక నిర్మాతలు ప్రమోషన్ లో కూడా వేగం పెంచేస్తున్నారు. ఆగస్టు 30న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ సినిమా రానుండటంతో అంచనాలు పెంచడానికి మేకింగ్ వీడియోలు, టీజర్లు, వీడియో సాంగ్స్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు మేకింగ్ వీడియోలు  సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఇక టీజర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. మొన్న విడుదలైన సైకో సయ్యా సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇదే ఊపులో ఇప్పుడు మరో వీడియో సాంగ్ కూడా విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. ఏ చోట నువ్వున్నా అంటూ ప్రభాస్, శ్రద్ధ కపూర్ డ్యూయెట్ పాడుకుంటున్నారు. సాహో అంటే కేవలం యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాదు రొమాన్స్ కూడా ఉంటుందని ఇప్పటికే సైకో సయ్యా పాటతో నిరూపించాడు దర్శకుడు సుజీత్. ఇప్పుడు ఆ డోస్ మరింత పెంచబోతున్నాడు. కచ్చితంగా ఈ పాటతో ప్రేక్షకుల్లో సాహో సినిమాపై ఒక అంచనా వచ్చేస్తుందని నమ్ముతున్నాడు దర్శకుడు సుజీత్. తమ సినిమాలో కేవలం యాక్షన్ సన్నివేశాలు మాత్రమే ఉంటాయి అనుకుంటున్న వాళ్లకు ఈ పాటలతో అన్నీ ఉంటాయని క్లారిటీ వచ్చేలా చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఖచ్చితంగా ఏ చోట నువ్వున్నా పాట ప్రేక్షకులకు నచ్చుతుందని ధీమాగా చెబుతున్నారు ఈయన. జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మొదటి పాటకు ఊహించిన రెస్పాన్స్ రాకపోవడంతో సాహో టీం కాస్త నిరుత్సాహ పడింది. కానీ ఇప్పుడు విడుదలయ్యే పాట మాత్రం కచ్చితంగా సంచలనం సృష్టిస్తుందని.. అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెబుతున్నాడు దర్శకుడు సుజీత్. మరి ఈయన నమ్మకాన్ని కొత్త పాట ఎంత వరకు నిలబెడుతుందో చూడాలి. జూలై 30న ఈ పాట విడుదల కానుంది.

More Related Stories