English   

రామ్ వచ్చాక ఇస్మార్ట్ పండగ చేసుకుందాం అంటున్న ఛార్మి..

 Ram Pothineni
2019-07-30 18:38:48

ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన సినిమాలలో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల లిస్టులో ఇస్మార్ట్ శంకర్ కూడా ఉంటుంది. పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. 11 రోజుల్లో 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి లాభాల పంట పండిస్తోంది ఇస్మార్ట్ శంకర్. పక్కా మాస్ సినిమా వస్తే ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో మరోసారి నిరూపించిన సినిమా ఇస్మార్ట్ శంకర్. సినిమా సక్సెస్ అయింది కదా అని పూరి జగన్నాథ్ అండ్ టీం ఊరికే వదిలేయడం లేదు. ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు.. వాళ్ళ అదృష్టం కొద్దీ విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో రెండవ వారం కూడా ismart శంకర్ కలెక్షన్ల వర్షం కురిపించాడు. చాలా చోట్ల ఈ సినిమా బయ్యర్లకు రెండింతలు లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా సక్సెస్ సంబరాలు చేసుకున్నారు దర్శక నిర్మాతలు. రాంగోపాల్ వర్మ అయితే ఏకంగా బీర్లు పొంగించేశాడు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇస్మార్ట్ శంకర్ విడుదలైన తర్వాత హీరో రామ్ ఎక్కడా కనిపించలేదు. పూరి జగన్నాథ్, రామ్ మధ్య కాంట్రవర్సీ నడుస్తుందని.. హీరోకు ఇప్పటివరకు అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై పూరి మాత్రం మరోలా స్పందించాడు. తన ఇస్మార్ట్ శంకర్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నానని.. వచ్చిన తర్వాత కలిసి పండగ చేసుకుంటాం అంటున్నాడు పూరి జగన్నాథ్. ఇదే విషయాన్ని ఇప్పుడు చార్మి కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇస్మార్ట్ హీరో మరో రెండు రోజుల్లో ఇండియాకు రాబోతున్నాడని.. వచ్చిన తర్వాత ఓ రేంజ్ లో పార్టీ చేసుకుందాం అంటూ ట్వీట్ చేసింది ఛార్మి. ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ అంటూ కింద తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇదే ట్వీట్ కు పూరి జగన్నాథ్ కూడా రిప్లై ఇచ్చాడు. మొత్తానికి ఇప్పుడు పూరీ, ఛార్మి గాల్లో తేలిపోతున్నారు. మరి రామ్ వచ్చిన తర్వాత ఆనందం ఇంకెంత పెరిగిపోతుందో చూడాలి.

More Related Stories