English   

విజయ్ దేవరకొండ చేసిన పని డియర్ కామ్రేడ్ కు హెల్ప్ అవుతుందా..

Dear Comrade
2019-07-30 19:09:35

కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండ సినిమా వస్తే బ్లాక్ బస్టర్ అనే మాట తప్ప మరొకటి వినిపించడం లేదు. కానీ చాలా రోజుల తర్వాత ఈయన నటించిన సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అదే డియర్ కామ్రేడ్.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ఊహించని విధంగా నెగిటివ్ టాక్ వచ్చేసింది. చాలా నెమ్మదిగా సాగే ప్రేమ కథ కావడంతో.. ప్రేక్షకులకు రీచ్ కావడానికి కూడా చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది. అయితే అంత సమయం ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాదు. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా కేవలం 18 కోట్లు మాత్రమే వసూలు చేసింది డియర్ కామ్రేడ్. ఈ సినిమా సక్సెస్ అనిపించుకోవాలంటే 35 కోట్లు వసూలు చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత తీసుకు రావడం అనేది దాదాపు అసాధ్యం. అయితే విజయ్ దేవరకొండ మాత్రం తన సినిమా ప్రమోషన్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఇది తన మనసుకు నచ్చే చేసిన సినిమా కాస్త నెమ్మదిగా ఉంటుంది ఓపిక పెట్టి చూడండి అంటూ ప్రమోషన్ చేస్తున్నాడు. ఆయనతో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా డియర్ కామ్రేడ్ ప్రమోషనల్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా వచ్చింది. ఇందులో రష్మిక మందన్న ఉమెన్ క్రికెటర్ గా నటించింది. ఆమె కెరీర్లో ఎదగాలంటే ఎదురయ్యే సమస్యలు.. సెక్సువల్ హరాస్మెంట్ లాంటి విషయాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు భరత్ కమ్మ. దాంతో ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ ను తీసుకు వస్తే సినిమాకు హెల్ప్ అవుతుందని భావించాడు విజయ్ దేవరకొండ. అనుకున్నట్లుగానే ఆమెను తన సినిమా ప్రమోషన్ కు తీసుకొచ్చాడు. సినిమా విడుదలైన మొదటి సోమవారం బోనాలు సందర్భంగా సెలవు ఉండటంతో మంచి వసూళ్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత నుంచి కలెక్షన్లు ఎలా వస్తాయనే దాన్ని బట్టి డియర్ కామ్రేడ్ ప్రయాణం ఎక్కడ ముగుస్తుంది అనేది తెలుస్తుంది. అప్పటి వరకు తన సినిమా ప్రమోషన్స్ మాత్రం ఆపను అంటున్నాడు విజయ్.

More Related Stories