English   

అక్కా అక్కా అంటూ తొక్కేసారంటున్న నటి హేమ..

hema
2019-07-30 21:10:15

బిగ్ బాస్ నుంచి ఇలా బ‌య‌టికి వ‌చ్చిందో లేదో అప్పుడే ఆ షోపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది హేమ‌. అక్క‌డున్న‌పుడు అంతా మంచోళ్లే అంటూ మాట‌లు చెప్పిన ఈమె.. బ‌య‌టికి అడుగు పెట్టిన త‌ర్వాత ఇష్ట‌మొచ్చిన‌ట్లు క‌మెంట్ చేసింది. త‌న‌ను మా టీవీ మోసం చేసింద‌ని చెబుతుంది ఈమె. నాగార్జున ముందున్న‌పుడు అంతా బాగుంది.. అంతా హ్యాపీ అంటూ చెప్పుకొచ్చింది హేమ‌. ఇప్పుడు మాత్రం కావాల‌నే త‌న‌ను ప్లాన్ చేసి మ‌రీ బ‌య‌టికి పంపించార‌ని చెప్ప‌డం సంచ‌ల‌నం. అస‌లు ఇంట్లో జ‌రిగింది జరిగిన‌ట్లు చూపించ‌డం లేద‌ని ఆరోపిస్తుంది హేమ‌. ఇక ఇంట్లో ఉన్న వాళ్లు కూడా చాలా డేంజర్ అంటుంది ఈ నటి. అందరిలోనూ శ్రీముఖి చాలా కన్నింగ్ కారెక్టర్ అని తేల్చేసింది ఈమె. అక్కడున్నపుడు అమ్మా.. తల్లి.. నాన్న అంటూ కనిపించిన హేమ బయటికి వచ్చిన తర్వాత మాత్రం సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది.

ముఖ్యంగా శ్రీముఖి, వరుణ్ సందేశ్ భార్య వితికా షెరూ తనను బయటికి పంపించడానికి ప్లాన్ చేసారని ఆరోపిస్తుంది. కచ్చితంగా ఇంటి నుంచి నెక్ట్స్ బయటికి వచ్చేది శ్రీముఖే అని చెబుతుంది హేమ. బాబా భాస్కర్ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడని చెప్పింది హేమ. ఇక అంతటితో ఆగకుండా వితికా, మహేష్ మధ్య అంత పెద్ద గొడవ జరిగినా కూడా అది హైలైట్ చేయకుండా కేవలం తను, రాహుల్ పై అరిచింది మాత్రమే హైలైట్ చేసారని మండిపడింది హేమ. తన రియల్ కారెక్టర్ పక్కనబెట్టి నటించి ఉంటే ఇప్పటికీ ఇంట్లోనే ఉండేదాన్ని అని.. కానీ అలా జరగలేదని చెప్పింది హేమ. తన కారెక్టర్ చంపుకోలేనని.. అందుకే బయటికి వచ్చేయాల్సి వచ్చిందంటుంది ఈమె. త‌న‌పై ముందు నుంచి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించార‌ని చెబుతుంది హేమ‌. అంతేకాదు మొద‌టి రోజు త‌న‌పై AV కూడా వేయలేద‌ని ఆవేద‌న వెల్ల‌గ‌క్కింది ఈ న‌టి.

లోపల జరిగిన గొడవ వేరని.. తానే వాళ్ల‌కు సర్దిచెప్పానని.. కానీ అక్క‌డ మాత్రం తానే గొడవపడ్డట్టు ప్రసారం చేశారని చెప్పుకొచ్చింది హేమ‌. అదే త‌న కొంప ముంచిందంటుంది ఈమె. త‌న‌కు గూగుల్ లో ఎక్కువ ఓట్స్ వచ్చాయని.. కానీ హాట్ స్టార్ లో మాత్రమే ఓట్ వేయాలని క్లియర్ గా చెప్పలేదని చెబుతుంది హేమ‌. త‌న‌ను ప్రమోట్ చేసేలా ప్రోమో వేస్తామని చెప్పి అది కూడా వేయ‌లేద‌ని మాటీవీపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది ఈమె. దీనిపై మా టీవీ వాళ్ల‌ను అడిగినా కూడా ఈ విషయంలో త‌న‌కు క్లారిటీ రాలేద‌ని చెబుతుంది. త‌న‌ను అక్క అక్క అంటూనే.. త‌న‌పై లేనిపోని మాటలు చెప్పారని.. చాలా ప్లాన్డ్ గా త‌న‌ను బయటకు పంపేలా చేసార‌ని చెబుతుంది హేమ‌. మ‌రి రాబోయే రోజుల్లో ఇంకా ఎంత‌మంది కంటెస్టెంట్స్ ఇలా బ‌య‌టికి వ‌చ్చి ర‌చ్చ చేస్తారో చూడాలి.

More Related Stories