English   

మహేష్ సినిమా కోసం బన్నీ సినిమా వదులుకున్న రావు రమేష్

ramesh
2019-07-30 22:14:06

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుండి సీనియర్‌ నటుడు రావూ రమేష్ తప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే రావు రమేష్ తప్పుకోవటం వెనక ఎటువంటి వివాదాలు లేవని అంటున్నారు. తన కాల్షీట్స్ సర్దుబాటు కాని కారణంగానే ఆయన తప్పుకున్నారని అంటున్నారు. దానికి కారణం ఏంటంటే ముందుగా కొన్ని డేట్స్ ఆయన అల్లు అర్జున్ సినిమా కోసం ఇవ్వగా అయన ఇచ్చిన డేట్స్ లో షూట్ పూర్తి చేయలేకపోయారని అందుకే  ఆయన స్థానంలో హర్ష వర్దన్‌ను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌, సుశాంత్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బన్నీ సినిమాతో పాటు అటు మహేష్ సినిమాలో కూడా రావు రమేష్ నటిస్తుండంతో డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారని అంటున్నారు.

More Related Stories