English   

అఖిల్ కి నాని హీరోయిన్ !

Akhil
2019-07-31 08:28:29

అక్కినేని కుటుంబం నుండి మూడో తరం వారసుడిగా సినీ ఆరంగ్రేటం చేసిన అఖిల్ కి కాలం కలిసి రావడం లేదు. ఇప్పటికే మూడు సినిమాలు చేసినా ఒక్కటీ సరయిన హిట్ పడలేదు. దీంతో ఎలా అయినా ఈసారి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. అయన ప్రస్తుతం డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కాస్టింగ్ అంతా దాదాపు ఒక కొలిక్కి వచ్చినా, అఖిల్‌ కి సరైన జోడీ అనిపించే హీరోయిన్ మాత్రం ఇప్పటిదాకా దొరకలేదు. ఎందరో హీరోయిన్ల పేర్లను పరిశీలించినా యూనిట్ ఎవరినీ ఫైనల్ చేయలేకపోయింది. అయితే అందుతున్న తాజా సమాచారం   ప్రకారం నాని గ్యాంగ్‌లీడర్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్‌ను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్టు చెబుతున్నారు. దాదాపుగా ఈమీ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్టేనని, అధికారికంగా ప్రకటించడమే లాంఛనం అని అంటున్నారు. మొన్ననే షూట్ కి వెళ్లిన ఈ సినిమా ని బన్నీ వాసు, వాసు వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివ‌ర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు  చెబుతున్నారు.
 

More Related Stories