English   

బిగ్ బాస్ కోసం శ్రీముఖికి షాకింగ్ రెమ్యునరేషన్ 

 Sreemukhi
2019-07-31 08:48:53

బిగ్ బాస్ త్రీ ప్రస్తుతం తెలుగు లోగిళ్లలో సందడి చేస్తున్న రియాలిటీ షో ఇది. ఎందుకో ఏమో కానీ ఈ క్కాన్సలేవుట్ మనవాళ్లకు బాగా ఎక్కేసింది, గేమ్ కాయాన్సప్ట్ నచ్చిందో ఏమో కానీ సీరియల్స్ ని సైతం పక్కన పెట్టి మరీ మనోళ్లు ఈ షో చూస్తున్నారు. అయితే ఈ షో గురించి ఎటువంటి వార్తా వచ్చినా అది పక్కన పడేయలేము అలా అని నిజమని నమ్మలేము, ప్రస్తుతం అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే బిగ్ బాస్ లో ప్రస్తుతం పాల్గొంటున్న శ్రీముఖి రెమ్యునరేషన్. నిజానికి ఈ విషయాలు బయటకి తెలియనివ్వరు మరి ఒకవేళ నిజంగా ఈ విషయం లీకయ్యిందో లేక ఎవరో వార్తలు లేక ఈ వార్త పుట్టించారో కానీ. శ్రీముఖి ఒక సాలిడ్ ఫిగర్ రెమ్యునెరేషన్ గా తీసుకుందని నిన్నటి నుండి ప్రచారం జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఆమె హౌస్ లో ఉండేదున్దుకు మూడు కోట్లు రెమ్యునరేషన్ గా ఛార్జ్ చేస్తోందట. నిజానికి ఈ  అమౌంట్ తెలుగులో ఒక సినిమా చేయడానికి కూడా పెద్ద హీరోయిన్స్ తీసుకోరు. అలాంటిది శ్రీముఖికి ఎందుకు ఇస్తారని కొందరు వాదిస్తుంటే లేదు, అన్నేసి రోజూలు హౌస్ లో ఉంటె అన్ని పనులు మానేసుకుని ఉంటుంది కాబట్టి ఎంత ఇచ్చినా తప్పులేదని మరికొందరు అంటున్నారు. ఇందులో నిజం ఎంతుందో ఏమో కానీ నిన్నటి నుండి ఇదొక చర్చనీయాంశంగా మారిపోయింది.  

More Related Stories