English   

కేరళ వెళ్లనున్న చిరంజీవి !

Chiru
2019-07-31 08:59:53

ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి  సైరా సినిమా రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తి అయ్యాక ఆయన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. మళ్ళీ చరణ్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమా విషయంలో అంతా సిద్దంగా ఉన్నా, ఇంకా పూజాధికాలు కూడా మొదలు పెట్టకపోవడానికి ఒక రీజన్ ఉందని అంటున్నారు. ఆ రీజన్ ఏంటంటే ఈ సినిమా క్సోం మొత్తం స్క్రిప్ట్ తో కొరటాల శివ సిద్ధంగా ఉన్నా ఈ సినిమా స్టోరీ పరంగా చిరంజీవి స్లిమ్ గా కనిపించాల్సిన అవసరం ఉండటంతో ప్రస్తుతం చిరు అదే పని మీదున్నాడట. రకరకాల ప్రయోగాలూ చేస్తున్న ఆయన త్వరలో కేరళకు ఆయుర్వేద ట్రీట్మెంట్ కోసం కూడా వెళ్తారని అంటున్నారు. అయితే ఈ విషయంలో నిజం ఎంతుందో తెలీదు కానీ, ఆయన తర్వాత సినిమా దిల్ రాజు ప్రొడ్యూస్ చేయనున్నాడని ప్రచారం మొదలయ్యింది. అయితే ఆ విషయం పక్కన పెడితే అందుతున్న సమాచారం ప్రకారం సైరా టీజర్ ను సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో ప్లాన్ చేసిన చిరూ అదే రోజున ఆయన సినిమా రిలీజ్ గురించి కూడా ప్రకటించవచ్చని అంటున్నారు. 

More Related Stories