English   

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ?

 Allu Bobby
2019-07-31 11:14:44

మన పురాణాల్లో పుష్పక విమానం అని ఒకటి ఉంటుంది, ఆ విమానం స్పెషాలిటీ ఏంటంటే ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటు ఉంటుంది. ఇప్పుడు అలానే ఉంది మెగా ఫ్యామిలీ పరిస్థితి కూడా,. ఇండస్ట్రీలో ఉన్న సినీ కుటుంబాల్లో ఈ కుటుంబమే పెద్దది, ఈ కుటుంబం నుండి దాదాపు అరడజను మందికి పైగా హీరోలు ఉండగా ఇప్పుడు లిస్టులో మరో పేరు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం మొదలయ్యింది. ఇప్పటికే ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ తన డేబ్యూ సినిమా కోసం ఫుల్ స్వింగ్ లో షూటింగ్ చేసుకుంటున్నాడు. ఆయనే అనుకునేరు కాదండోయ్ ఆయన తర్వాత ఇప్పుడు మారొకరి పేరు తెర మీదకి వచ్చింది. ఆ పేరే అల్లు బాబీ, ఎవరా ఈ అల్లు బాబీ అని బుర్రలు బద్దలు కొట్టుకోకండి, ఈయన అల్లు ఆరవింద్ పెద్ద కుమారుడు. అల్లు అరవింద్ కి ముగ్గురు కుమారులు కాగా ఒకరు బన్నీ, తెలుగు మళయాళ ఇండస్ట్రీలలో స్టార్ హోదా సంపాదించుకున్నాడు, మరొకరు శిరీష్ నాలుగైదు సినిమాలు చేసి సాలిడ్ హిట్ కొసం తంటాలు పడుతున్నడు. వారి అన్నానే ఈ బాబీ, ఈ మాధ్యనే రెండో వివాహం చేసుకుని వార్తల్లికి ఎక్కినా ఈయన త్వరలోనే నటన వైపు రానున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందొ తెలియదు కానీ ఫిలిం నగర్ వర్గాల్లో మాత్రం ఈ విషయం మీద తీవ్రమైన చర్చ నడుస్తోంది. అయితే ఆయన కేవలం నటుడిగా సరిపెడతారా లేక హీరో అవుతారా అనే విషయం మీద సందిగ్దత కొనసాగుతోంది. చూద్దాం మరి ఏమవుతుందో ? 

More Related Stories