English   

బిగ్ బాస్ లోకి వెళ్లాలంటే ఆ టెస్ట్ చేయించుకోవాల్సిందేనా..? 

Bigg Boss
2019-07-31 12:08:11

ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తూనే ఉంది బిగ్ బాస్ షో. దీనికి కాంట్రవర్సీలతో పాటు రేటింగ్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. దాంతో నిర్వాహకులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బయట ఏం జరిగినా కూడా తమకు భయం లేదంటున్నారు వాళ్లు. బిందాస్ గా ఏమేం చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారిప్పుడు. ఇక ఈ షో నుంచి తొలివారమే బయటికి వచ్చిన హేమ.. తనకు నచ్చిన కామెంట్స్ చేస్తూనే ఉంది. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ పై సెటైర్లు వేసిన హేమ.. ఇప్పుడు మరో సంచలన విషయంపై చర్చకు తెరతీసింది. బిగ్ బాస్ లోకి వెళ్లాలంటే కచ్చితంగా అమ్మాయిలు గర్భ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సిందే అని చెప్పింది ఈమె. తనకు కూడా ఇది అడిగారని.. తాను చేయించుకుని మెడికల్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చానని చెబుతుంది హేమ. ఈ విషయంపై ఇప్పుడు అసలు రచ్చ మొదలవుతుంది. అమ్మాయిలను ఎవరైనా అలా అడుగుతారా అంటూ కొందరు అంటుంటే.. అందులో తప్పేం లేదని హేమ చెబుతుంది. ఒకవేళ తనే గనక ప్రగ్నెంట్ అయితే.. గేమ్ ఆడేటప్పుడు కింద పడితే అబార్షన్ అవుతుంది.. అప్పుడు కారణం బిగ్ బాస్ వాళ్లే అవుతారు కదా.. ఆ సమస్యలు రాకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు.. అందులో తప్పేం లేదని సమర్థించింది హేమ. ఇప్పుడు ఇంట్లో ఉన్న అమ్మాయిలంతా ఈ పరీక్ష చేయించుకున్న తర్వాత లోపలికి వెళ్లారని చెబుతుంది ఈమె. హిమజ, వితిక, శ్రీముఖి, ఆశురెడ్డి, రోహిణి, శివజ్యోతి లాంటి వాళ్లు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నారు. అబ్బాయిలు కూడా మెడికల్ టెస్టులు చేయించుకున్న తర్వాత కానీ ఇంట్లోకి ఎంట్రీ ఉండదని చెప్పింది హేమ. మొత్తానికి ఈమె చెప్పిన విషయాలు ఇప్పుడు కొత్త సంచలనాలకు తెరతీస్తున్నాయి.   

More Related Stories