English   

సైమా అవార్డులకు ముఖ్య అతిథులుగా చిరంజీవి, మోహన్ లాల్..

siima
2019-07-31 14:09:44

ప్రతీ ఏడాది సైమా అవార్డులు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు నిర్వాహకులు. ఈ సారి కూడా ఇదే చేస్తున్నారు. ఆగస్ట్ 15న జరగబోయే ఈ ఈవెంట్ కోసం స్టార్స్ కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. దుబాయ్ లో ఈ వేడుక జరగబోతుంది. అక్కడ తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది భాషలన్నింటికీ సంబంధించిన వేడుక జరగనుంది. దీనికి అతిరథ మహారథులు హాజరు కానున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు అక్కడికి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. సైమా అవార్డులకు ఈసారి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కానున్నాడు. ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా వెల్లడించారు. ఆగస్ట్ 15న దుబాయ్ లోని లూసయల్ స్పోర్ట్స్ అరెన, దోమ, ఖాతర్ లో జరగబోయే ఈ వేడుకకు చిరు రానున్నట్లు పోస్టర్ కూడా విడుదల చేసారు సైమా నిర్వాహకులు. తెలుగు, కన్నడ ఈవెంట్ కు చిరంజీవి.. తమిళ, మళయాల అవార్డులకు మోహన్ లాల్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ వేడుక కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు నిర్వాహకులు. అభిమానులు కూడా సైమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు.

More Related Stories