English   

దిల్ రాజు ఆ రెండు సినిమాలు కొనుంటే ఇప్పుడు ఉండేవాడు కాదంట.. 

Dil Raju
2019-07-31 18:31:45

జీవితంలో ఎవరెన్ని చెప్పినా కూడా స్వీయ అనుభవం కంటే మించింది మరోటి ఉండదు. ఎదురు దెబ్బలు తగిలినపుడు ఆటోమేటిక్ గా మనసు గాడిన పడుతుంది. ఇప్పుడు దిల్ రాజు విషయంలో కూడా ఇదే జరిగింది. ఒకప్పుడు ఈయన చేసిన తప్పులే ఇప్పుడు తనకు హెల్ప్ అవుతున్నాయంటున్నాడు ఈ నిర్మాత. కథల ఎంపికపై తనకు ఇంత పట్టు రావడానికి కారణం ఒకప్పుడు తాను చేసిన తప్పులే అంటున్నాడు ఈయన. ఓ సమయంలో ఇండస్ట్రీ తనకు అచ్చిరాదని వెనక్కి వెళ్లిపోదామని కూడా ప్లాన్ చేసుకున్నట్లు చెప్పాడు దిల్ రాజు. మొదట్లో ఈయన కొన్న సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. 1996లో 'ప్రియమైన శ్రీవారు', సౌందర్య హీరోయిన్ గా నటించిన 'అరుంధతి' సినిమాల్ని కొని తీవ్రంగా నష్టపోయాడు దిల్ రాజు. ఆ తర్వాత ఇక్కడ ఉండటానికి కూడా కష్టం అయిపోయిందని గుర్తు చేసుకున్నాడు. అయితే కాస్ట్యూమ్స్ కృష్ణ సహకారంతో 'పెళ్లిపందిరి' రైట్స్ తీసుకున్నానని.. ఆ సినిమాతో పోయిన డబ్బులన్నీ వెనక్కి వచ్చాయని చెప్పాడు దిల్ రాజు. ఆ తర్వాత కూడా కొన్ని ప్లాపులు వచ్చాయని.. ముఖ్యంగా రెండు సినిమాలు కొనకుండా ఆగిపోవడం తన జీవితంలో చేసిన అత్యంత మంచి పని అని చెప్పాడు దిల్ రాజు. 

ఈ రెండు చిత్రాల్ని కొనాలని ముందు రాజు చాలా ఆశ పడినా అనుకోకుండా అవి తన చేజారాయి. అవే తర్వాత డిజాస్టర్ అయ్యాయి. ఆ సినిమాలే వెంకటేష్ 'దేవీపుత్రుడు'.. చిరంజీవి మృగరాజు. దేవీ పుత్రుడు సినిమాకు ముందు అడ్వాన్స్ ఇచ్చినా కూడా ఇంకొకరు ఎక్కువగా ఇచ్చారని ఎమ్మెస్ రాజు ఇచ్చిన డబ్బు వాపస్ ఇచ్చేసాడని గుర్తు చేసుకున్నాడు రాజు. ఆ తర్వాత చిరంజీవి 'మృగరాజు' సినిమాను కూడా ఎందుకో చివరి నిమిషాల్లో డ్రాప్ అయ్యానని చెప్పాడు ఈయన. ఆ రెండు సినిమాలు కొని ఉంటే తన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే ఇప్పటికీ వణుకు పుడుతుందని.. నిర్మాతగా మాత్రం ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎప్పుడూ రాలేదని రాజు చెప్పాడు. ఇక తాను నిర్మాతగా మారి చేసిన మరో చరిత్ర తనకు ఎంతో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పాడు దిల్ రాజు. ఈ సినిమా తీసినందుకు ఇప్పటికీ తాను చాలా భాద పడతానని చెప్పాడు. తన కజిన్ నిరంజన్ రెడ్డి కోసం ఆ సినిమా చేశానని.. 5 కోట్లలో తీయాలనుకుంటే బడ్జెట్ రెండింతలు అయిందని చెప్పాడు. క్లాసిక్ సినిమాలను ముట్టుకోకూడదని గుణపాఠం నేర్చుకోవడానికి తనకు 10 కోట్లు వదిలించుకోవాల్సి వచ్చిందని చెప్పాడు దిల్ రాజు. మొత్తానికి ఏదేమైనా కూడా తనకు దేవీపుత్రుడు, మృగరాజు మాత్రం ఎప్పటికీ మరిచిపోలేని మేలు చేసాయంటున్నాడు ఈ నిర్మాత.

More Related Stories